ఈ సారి 50 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణేషుడికే పట్టం

ఈ సారి 50 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణేషుడికే పట్టం

తెలంగాణలో వినాయకచవితి అనగానే గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేషుడే. ఏటికేటు విభిన్న రూపాల్లో భక్తులకు దర్శనిమిస్తూ.. రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధికెక్కాడు. అయితే ఎప్పటిలాగే ఈ సారి కూడా భక్తులను అనుగ్రహించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవలే ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద గణనాథుడి విగ్రహ నిర్మాణ పనులను ప్రారంభించిన ఉత్సవ కమిటీ.. కర్ర పూజను కూడా చేశారు. మరో విశేషమేమిటంటే ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ సారి మట్టి గణపతిని ప్రతిష్టించనున్నట్టు సమాచారం. ఇకపోతే ఈ విగ్రహాన్ని ఈ ఏడాది మొదటిసారి 50 అడుగుల ఎత్తులో ఉండే పంచముఖ లక్ష్మీ గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నట్టు తెలుస్తోంది. వినాయక చతుర్థి దగ్గరపడుతుండడంతో గణేషుడి విగ్రహ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి.