నీటిని వృథా చేస్తే జరిమానా వేయాలి: ఎర్రబెల్లి

నీటిని వృథా చేస్తే జరిమానా వేయాలి: ఎర్రబెల్లి

మిషన్ భగీరథ పనుల్లో  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారులపై కఠిన చర్యలు తప్పవన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అధికారులు అలసత్వం వీడాలన్నారు. మిషన్ భగీరథపై జనగామ జిల్లా పాలకుర్తిలో జరిగిన ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సులో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలన్నారు.

నీటిని వృథా చేసే వారికి గ్రామ పంచాయితీలు జరిమానా విధించాలన్నారు. మిషన్ భగీరథ కార్యక్రమం దేశ వ్యాప్తంగా ఆదర్శంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఇదే పథకాన్ని అమలు చేయాలని  చూస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకున్నా.. సీఎం కేసీఆర్ రూ.45 వేల కోట్లతో మన రాష్ట్రంలో మిషన్ భగీరథ చేపట్టారని అన్నారు.  30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను పల్లె ప్రగతిగా సీఎం కేసీఆర్ గారు మార్చారు.మిషన్ భగీరథ అమలులో పాలకుర్తి నియోజకవర్గం ఆదర్శంగా నిలవాలన్నారు.