మల్లికార్జున్ కు ప్రభుత్వం గౌరవం ఇవ్వట్లేదు: వివేక్ వెంకటస్వామి

మల్లికార్జున్ కు ప్రభుత్వం గౌరవం ఇవ్వట్లేదు: వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్ గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ లో మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు దివంగత మల్లికార్జున్ 82వ జయంతి, విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ సాధన కోసం1969 తెలంగాణ ఉద్యమకారుడిగా.. కేంద్ర మాజీ మంత్రిగా సేవలందించిన దివంగత నేత డాక్టర్‌ మల్లికార్జున్‌ అని మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి కొనియాడారు. తెలంగాణ పోరాటం సందర్భంగా యువతను మెల్కొల్పి.. పోరాటంలో అందరు భాగమయ్యేలా ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో మల్లికార్జున్ కు తగిన గౌరవం ఇవ్వడంలేదని వివేక్ వెంకట స్వామి విమర్శించారు. 

దివంగత నేత మల్లికార్జున్ విగ్రహాన్ని గవర్నర్ దత్తాత్రేయతో కలసి మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి, మల్లికార్జున్ కుటుంబ సభ్యులు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మల్లికార్జున్ జీవిత భాగస్వామి, శ్రీమతి భాగ్యలక్ష్మి మల్లికార్జున్ కుమారుడు శ్రీ మను మల్లికార్జున్‌, పలువురు నేతలు హాజరయ్యారు.