మున్సిపల్​ కార్పొరేషన్​లో అవినీతిని బయటపెడ్తా

మున్సిపల్​ కార్పొరేషన్​లో  అవినీతిని బయటపెడ్తా

కరీంనగర్ టౌన్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నైతికంగా తానే విజయం సాధించానని కరీంనగర్​మున్సిపల్​ కార్పొరేషన్​ మాజీ మేయర్​ రవీందర్​ సింగ్​అన్నారు. ఇండిపెండెంట్ గానే కొనసాగుతూ కొర్పొరేషన్​లో జరుగుతున్న అవినీతిని బయటపెడ్తానని చెప్పారు. ఆదివారం సిటీలోని ఓ ప్రైవేట్​హోటల్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజీనామా చేయమని కోరేముందు వేరే పార్టీల్లోంచి టీఆర్ఎస్ లో చేరిన లీడర్లందరిని రాజీనామా చేయించాలని కోరారు. ఓటర్లను అధికార పార్టీ ఎన్నో ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. తాను పోటీలో ఉండడంతోనే మినిష్టర్ ఆధ్వర్యంలో క్యాంపు రాజకీయాలు చేపట్టారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను భయాందోళనకు గురి చేశారన్నారు. ఎలక్షన్​రూల్స్​అతిక్రమించినా పోలీసులు అధికార పార్టీకే మద్దతిచ్చారని పేర్కొన్నారు. ఓటర్లను వెహికల్స్​లో తరలించొద్దనే  రూల్​ను పక్కన పెట్టారని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రాలకు సెల్ ఫోన్స్ తీసుకెళ్లడం ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడం కాదా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో భానుప్రసాద్ రావుతో పాటు రమణకు సమాన ఓట్లు రావాలని అన్నారు. ఓట్లు ఎవరికి తగ్గినా నైతిక బాధ్యత మంత్రి గంగుల కమలాకర్ దేనని చెప్పారు. కరీంనగర్ కార్పొరేషన్​కమిషనర్, ఎస్ఈతో పాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ లాంగ్ లీవ్​ తీసుకోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడితో వారు లీవ్​ తీసుకున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.