‘గ్రే’ లిస్ట్లో పాక్

‘గ్రే’ లిస్ట్లో పాక్

పాకిస్తాన్‌‌‌‌ను  ‘గ్రే’ లిస్ట్‌‌‌‌లో పెట్టాలని ఇంటర్నేషనల్‌‌‌‌ ఫైనాన్సింగ్‌‌‌‌ వాచ్‌‌‌‌ డాగ్‌‌‌‌ … ఫైనాన్షియల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌  టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ (ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌) నిర్ణయించింది.  లష్కరే తోయిబా, జైషే మహమ్మద్‌‌‌‌ లాంటి టెర్రరిస్టు  గ్రూపులకు, ఇతర టెర్రర్‌‌‌‌ సంస్థలకు ఫండ్స్‌‌‌‌ అందకుండా చర్యలు తీసుకోవాలని చేసిన సూచనల్ని పట్టించుకోనందువల్లే ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ ఈ డిసిషెన్‌‌‌‌ తీసుకుంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన మీటింగ్‌‌‌‌లో పాక్‌‌‌‌ తీరును ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌   తప్పుపట్టింది.

గత జూన్‌‌‌‌లో జరిగిన సమావేశంలో  ఈమేరకు ఒక యాక్షన్‌‌‌‌ప్లాన్‌‌‌‌ను  పాకిస్తాన్‌‌‌‌కు  టాస్క్‌‌‌‌ ఫోర్స్‌‌‌‌ ఇచ్చింది.   ఈ  ఏడాది జనవరినాటికి కూడా పాక్‌‌‌‌ ఎలాంటి టార్గెట్లను సాధించలేకపోయింది. రెండోసారి  ఇచ్చిన మే  గడువులోగా కూడా అమలుచేయాల్సిన యాక్షన్‌‌‌‌ప్లాన్‌‌‌‌లో  ఎలాంటి ప్రోగ్రెస్‌‌‌‌ లేదని ఫ్లోరిడా   మీటింగ్‌‌‌‌లో పాక్‌‌‌‌పై ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ సీరియస్‌‌‌‌ అయంది. దీందో ఆదేశాన్ని ‘గ్రే’ లిస్ట్‌‌‌‌లో  కొనసాగించడం మినహా మరో దారిలేదని క్లారిటీ ఇచ్చింది.   కనీసం చివరి గడువైన అక్టోబర్‌‌‌‌ నాటికైనా పాకిస్తాన్‌‌‌‌ తాము విధించిన యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ను అమలుచేయడానికి అవసరమైన చర్యల్ని తీసుకుంటుందన్న ఆశాభావాన్ని ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ వ్యక్తంచేసింది.

టెర్రర్‌‌‌‌ గ్రూపులకు ఫండ్స్‌‌‌‌ అందకుండా చేయడంలోగాని, యాంటీ టెర్రిరస్ట్‌‌‌‌ చట్టాల కింద  టెర్రర్‌‌‌‌ మాస్టర్‌‌‌‌మైండ్స్‌‌‌‌ హఫీజ్‌‌‌‌ సయీద్‌‌‌‌, మసూద్‌‌‌‌ అజర్‌‌‌‌లపై కేసులు నమోదుచేయడంలో కాని పాకిస్తాన్‌‌‌‌ పూర్తిగా ఫెయిల్‌‌‌‌ అయిందని ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ మీటింగ్‌‌‌‌లో పాల్గొన్న అమెరికా, యూకే, ఫ్రాన్స్‌‌‌‌ లాంటి దేశాలు విమర్శించాయి.

పాక్‌‌‌‌ వాదనేంటి?

పాక్‌‌‌‌ను 2012లోనే ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ ‘గ్రే’ లిస్ట్‌‌‌‌లో పెట్టింది. దీంతో కాస్త దిగొచ్చినట్టు కనిపించిన పాకిస్తాన్‌‌‌‌ లష్కరే తోయిబా, జై షే మహ్మద్‌‌‌‌ లాంటి సంస్థలకు చెందిన 700  ఆస్తుల్ని సీజ్‌‌‌‌ చేసినట్టు ప్రకటించింది. అయితే సయీద్‌‌‌‌ , మసూద్‌‌‌‌ లాంటి టెర్రర్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ లీడర్లు, యూఎన్‌‌‌‌ గుర్తించిన టెర్రరిస్టులపై ఎలాంటి కేసులు నమోదుచేయనందుకు పాక్‌‌‌‌పై ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ మెంబర్లు సీరియస్‌‌‌‌ అయ్యారు. తమ దేశంలో తలదాచుకుంటున్న టెర్రరిస్టులకు ఆర్థికసాయం ఆపేయడంలో పాకిస్తాన్‌‌‌‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ  గత  ఏడాది ఫిబ్రవరి సమావేశంలో ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌  నామినేటెడ్‌‌‌‌ మెంబర్లైన.. అమెరికా, యూకే, జర్మనీ , ఫ్రాన్స్‌‌‌‌ చేసిన వాదనల్ని ఇండియా సపోర్ట్‌‌‌‌చేసింది.

గతేడాది జూన్‌‌‌‌లో సమావేశమైన ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌ పాక్‌‌‌‌ను గ్రే లిస్ట్‌‌‌‌లో పెట్టడమేకాదు.. ఆదేశానికి 27 పాయింట్ల యాక్షన్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ ఇచ్చింది.  గతేడాది అక్టోబర్‌‌‌‌లో ఈ ప్లాన్‌‌‌‌ ఎంతమేరకు ఆదేశం అమలుచేసిందో రివ్యూ చేసింది.  పాక్‌‌‌‌ గడ్డమీద పనిచేస్తున్న టెర్రర్‌‌‌‌ గ్రూపులకు సంబంధించిన సమాచారాన్ని ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌కి మన దేశం  ఇవ్వడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ మరోసారి ఆ దేశం ‘గ్రే’ లిస్ట్‌‌‌‌లోనే కొనసాగింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌‌‌‌ లాంటి టెర్రర్‌‌‌‌ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న కొంతమందిని  అరెస్టుచేసినట్టు పాకిస్తాన్‌‌‌‌ అధికారులు ఎఫ్‌‌‌‌ఏటీఎఫ్‌‌‌‌  దృష్టికి తీసుకొచ్చి మోసగించాలని ప్రయత్నించారు.  వాళ్లను పబ్లిక్‌‌‌‌ మెయింటినెన్స్‌‌‌‌  యాక్ట్‌‌‌‌ కింద మాత్రమే అరెస్టుచేశారు గాని యాంటీ టెర్రరిజం యాక్ట్‌‌‌‌-1997 కింద కాదని తేలిపోయింది.