సూపర్ వైజర్ కుక్క : హోంవర్క్ అయ్యేదాకా కదలదు

సూపర్ వైజర్ కుక్క : హోంవర్క్ అయ్యేదాకా కదలదు

మనిషికి అత్యంత విశ్వాసవంతమైన జంతువు శునకమే. ఓ మనిషి.. మనిషి తర్వాత నమ్మే జంతువు కుక్కనే. కుక్క కూడా ఓ కుక్క తర్వాత నమ్మేది మనిషినే. అందుకే.. మనిషి, కుక్క మధ్య సిబ్లింగ్ రిలేషన్ ఉందంటుంటారు. అది మరోసారి నిజం చేస్తోంది చైనాలోని ఈ కుక్క.

ఇళ్లకు కుక్కలు కాపలా ఉండటం కామన్. దొంగలను పట్టివ్వడం గురించి చూస్తూనే ఉన్నాం. కానీ.. హోంవర్క్ కూడా చేయించే కుక్క సంగతి ఇపుడు తెల్సుకుందాం.

ఈ సూపర్ వైజర్ డాగ్… సౌత్ వెస్ట్ చైనాలోని గుయిజోవ్ ప్రావిన్స్ లో ఉంది. పియర్ షు అనే వ్యక్తి ఈ కుక్కపిల్లను పప్పీగా ఉన్నప్పటినుంచి పెంచాడు. తన కూతురుకు కూడా అది మంచి ఫ్రెండ్. ఇంట్లో పెంచుకునే అన్ని కుక్కల్లా కాకుండా.. ఈ పెట్ డాగ్ కు కొన్ని కొత్త విద్యలు నేర్పించాడు ఆ తండ్రి. అదే తన కూతురు హోంవర్క్ చేసేటప్పుడు సూపర్ వైజింగ్ చేయడం.

హోంవర్క్ అయ్యేవరకు దగ్గరుండి సూపర్ వైజ్ చేయాలని.. వర్క్ పూర్తిచేయకుండా అమ్మాయి కనుక టీవీ చూసినా… సెల్ ఫోన్ పట్టి ఆడినా… మొరిగి హెచ్చరించాలని నేర్పించాడు. హోంవర్క్ చేసే టైమ్ ను కూడా కుక్కకు అలవాటు చేశాడు. ఆ సమయానికి అమ్మాయి పుస్తకాలే పట్టాలి. అక్కడి నుంచి వేరేచోటకు వెళ్లినా.. వెనకాలే వెళ్లి లాక్కొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి వర్క్ చేయిస్తుంది ఈ సూపర్ వైజర్.

పియర్ షు కూతురు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే.. కుక్క దృష్టంతా ఆమెపైనే ఉంటుంది. దాని ముందు కాళ్లను టేబుల్ పై పెట్టి అలర్ట్ గా ఉంటుంది ఆ కుక్క. దృష్టి మరల్చితే బెదిరిస్తుంది.

ఈ కుక్కను చూసి చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న పెట్ డాగ్స్ కు కూడా ఇది అలవాటు అయిందట.

చిన్నప్పటినుంచి చెబుతూ నేర్పడం వల్లే తమ పెట్ డాగ్… వాచ్ డాగ్ అయిందని అన్నాడు షు. తన కూతురుతో అది ఎంత ఆటలాడినా… హోంవర్క్ దగ్గరకొచ్చేసరికి మాత్రం సీరియస్ గా మారిపోతుందని అన్నాడు. గమ్మత్తుగా ఉంది కదూ.