గరీబ్ కల్యాణ్ యోజనతో 42 కోట్ల మందికి లాభం

గరీబ్ కల్యాణ్ యోజనతో 42 కోట్ల మందికి లాభం

న్యూఢిల్లీ, వెలుగు: లాక్ డౌన్ లో పేద, మధ్య తరగతి ప్రజల కోసం రూ. 53, 248 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. గరీబ్ కల్యాణ్ యోజన ద్వారా పేదలు, మహిళలు, వృద్దులు,  రైతులకు సాయం చేసినట్లు పేర్కొంది. ఏప్రిల్, మే లో ఈ పథకం ద్వారా దాదాపు 42 కోట్ల మందికి మేలు జరిగిందని వెల్లడించింది. జూన్ నాటికి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు దాదాపు 101 లక్షల మెట్రిక్ టన్నుల  ఆహార ధాన్యాలను అందించినట్లు తెలిపింది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకంలో భాగంగా 8.19 కోట్ల మంది రైతులకు రూ.  2 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించింది. ఇందుకోసం  రూ. 16, 394  కోట్లు చెల్లించింది.  జన్ ధన్ అకౌంట్ల లో రూ. 500 చొప్పున ఏప్రిల్ లో 20.05 కోట్ల మందికి దాదాపు (98.33%), మే లో 20.62 కోట్ల మంది  (100%) చెల్లించింది. సుమారు 2.81 కోట్ల మంది  వృద్ధులు, వితంతువులు,  వికలాంగులకు రూ. 2,814.5 కోట్లను  ఏప్రిల్, మే నెలలో పంపిణీ చేసింది.ఉజ్వల స్కీం లో 9.25 కోట్ల సిలిండర్లను బుక్ చేసుకోగా 8. 58 కోట్ల  సిలిండర్లను ఫ్రీగా పంపిణీ చేసింది.  రాష్ట్రాలకు పెండింగ్ లో ఉన్న  రూ. 28,729  కోట్ల ను విడుదల చేసింది. 2.3 కోట్ల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 4వేల కోట్ల సాయమందించింది.

గుళ్లలో తీర్థ ప్రసాదాలు వద్దు