భారత్ కు వస్తున్న చిరుతల ఫస్ట్ లుక్

భారత్ కు వస్తున్న చిరుతల ఫస్ట్ లుక్

నమీబియా నుంచి 8 చీతాలను స్పెషల్ ఫ్లైట్ లో భారత్ కు తీసుకురానున్నారు. చీతాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. ఒక నిమిషం ఉన్న ఈ వీడియోలో చీతాలు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాయి. భారతదేశం - నమీబియా దేశాల మధ్య ఈ సంవత్సరం ప్రారంభంలో ఒప్పంద సంతకాలు జరిగాయి. చీతాలను స్పెషల్ ఫ్లైట్ లో తీసుకరానున్నారు. నమీబియాలోని విండ్ హోక్ అంతర్జాతీయ విమాశ్రయం నుంచి బయల్దేరి మధ్యప్రదేశ్ గ్వాలియర్ కు చేరుకుంటుంది. 8 చీతాల్లో ఐదు ఆడ, మూడు మగ చీతాలున్నాయి. 

వెరైటీగా, పులి ఫేస్ తో  అలంకరించిన బి747 జంబోజెట్ విమానం ఫొటోలను నమీబియాలోని భారత హైకమిషన్ కార్యాలయం విడుదల చేసింది.సెప్టెంబరు 17న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఆ ఆఫ్రికా పులులను స్వయంగా ప్రధాని మోడీ కునో నేషనల్ పార్క్ లోకి  రిలీజ్ చేయ‌నున్నారు. దేశంలో చిరుతలు తరించిపోయాయని 1952లో భారత ప్రభుత్వం ప్రకటించింది. వాటి పునరుద్ధరణ కోసం పునరుత్పత్తి ప్రాజెక్టును చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.