డయాబెటిస్ పేషంట్స్ కోసం ఫుడ్‌కేట్ బెస్ట్​ మొబైల్ అప్లికేషన్

డయాబెటిస్ పేషంట్స్ కోసం ఫుడ్‌కేట్ బెస్ట్​ మొబైల్ అప్లికేషన్

వెరియో ఫ్లెక్స్ గ్లూకోమీటర్

వాస్తవానికి గ్లూకోమీటర్లు ఎన్నో ఏండ్ల నుంచి అందుబాటులో ఉన్నాయి. కానీ.. వాటినే కొత్త టెక్నాలజీతో అప్​గ్రేడ్​ చేస్తూ వస్తున్నారు. అలా వచ్చిందే వన్​ టచ్​ కంపెనీ తెచ్చిన ఈ స్మార్ట్​ గ్లూకో మీటర్. వన్​ టచ్​ వెరియో ఫ్లెక్స్ గ్లూకోమీటర్ వాడడం చాలా ఈజీ. ఇది కచ్చితమైన రిజల్ట్స్ ఇస్తుంది. అంతేకాదు.. గ్లూకోజ్ రీడింగ్‌లను వన్​ టచ్​ రివీల్​ మొబైల్ యాప్‌లో చూపిస్తుంది. దీంతో టెస్ట్​ చేసుకోవాలంటే.. ముందుగా టెస్ట్ స్ట్రిప్‌పై ఒక చుక్క రక్తం వేయాలి. తర్వాత ఆ స్ట్రిప్​ని మీటర్‌లోకి చొప్పించాలి. ఐదు సెకన్లలోనే రిజల్ట్ వచ్చేస్తుంది.

కనెక్టెడ్​ సీజీఎం -ఇన్సులిన్ పంపులు

షుగర్​ పేషెంట్ల కోసం వచ్చిన మరో బెస్ట్​ గాడ్జెట్​ ఇది. ఇందులో సీజీఎంతోపాటు -ఇన్సులిన్ పంప్ కూడా ఇన్​బిల్ట్​గా ఉంటుంది. ఇందులో ఇన్సులిన్​ పంప్​ ఇన్సులిన్​ మోతాదులో మార్పులు చేసుకునేందుకు సీజీఎంతో కలిసి పనిచేస్తుంది. గ్లూకోజ్​ లెవల్స్​ని బట్టి, అవసరమైన సర్దుబాట్లు చేసుకుంటుంది. ఇన్సులిన్ పంప్‌ని దాన్ని పెట్టుకున్న వ్యక్తి అవసరాలను తీర్చడానికి సరిపోయేలా ప్రోగ్రామ్ చేస్తారు. ఒక చిన్న ప్లాస్టిక్ ట్యూబ్(కాన్యులా)ని చర్మంలోని కణజాలంలోకి చొప్పిస్తారు. ఇది పంపులోని రిజర్వాయర్‌కు కనెక్ట్​ చేసి ఉంటుంది. దీన్ని ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి మార్చాలి. సీజీఎం నుంచి సిగ్నల్​ అందిన వెంటనే బాడీలోకి ఇన్సులిన్​ని పంపు చేస్తుంది.

కీటోన్ మానిటర్

మధుమేహంతో బాధపడుతున్న వాళ్లలో లివర్​లో ఎక్కువ కీటోన్లు విడుదల అవుతుంటాయి. దాంతో రక్తం ఎసిడిక్​​(ఆమ్లం)గా మారుతుంది. దీన్ని డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అని పిలుస్తారు. ఇది డయాబెటిక్ కోమాకు దారితీస్తుంది. కొన్నిసార్లు పేషెంట్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ప్రత్యేకించి టైప్–2 షుగర్​ ఉన్నవాళ్లకు ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే అలాంటివాళ్లు కీటోన్ల ప్రొడక్షన్​ని కూడా ట్రాక్ చేసుకుంటుండాలి. అందుకోసం  చాలా కంపెనీలు కీటోన్ బ్రీత్‌లైజర్​ని మార్కెట్​లోకి తీసుకొచ్చాయి. అయితే.. దీనికంటే.. రక్తం, మూత్రంతో చేసే టెస్ట్​లు మరింత ఆక్యురేట్​గా ఉంటాయని ఎక్స్​పర్ట్స్​ అంటున్నారు.

ఫుడ్​కేట్​

డయాబెటిస్ ఉన్నవాళ్లందరికీ ఫుడ్‌కేట్ బెస్ట్​ మొబైల్ అప్లికేషన్. ఈ అప్లికేషన్​లో ఫుడ్​లోని పోషక విలువల గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్​ ఉంటుంది. అంతేకాదు.. ఏ ఫుడ్​ బెస్ట్​ అనేది కూడా తెలుసుకోవచ్చు. ఈ యాప్​లో ఉన్నట్టుగా ఫుడ్​ హ్యాబిట్స్​ని పూర్తిగా మార్చుకోగలిగితే.. షుగర్​ని కొంతవరకు కంట్రోల్​ చేసుకోవచ్చు. ఈ యాప్​ ద్వారా ఏం తినాలి? ఏం తినకూడదు? అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఏ ఫుడ్​లో ఎంత షుగర్​ ఉందో కూడా ఈ యాప్​లో తెలుసుకోవచ్చు.​ ఐఫోన్, ఆండ్రాయిడ్​ ఫోన్లకు ఈ యాప్​అందుబాటులో ఉంది.

డయాబెటిస్​: ఎం

డయాబెటిస్ ఉన్నవాళ్ల అన్ని అవసరాలను ఈ యాప్​తో ట్రాక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఐఫోన్, ఆండ్రాయిడ్​ ఫోన్లకు అందుబాటులో ఉంది. ఇందులో మందులు వేసుకోవాల్సిన టైం, షుగర్ టెస్టింగ్ రిమైండర్​, బ్లడ్​లో షుగర్ లెవల్స్​ లాగ్‌ను ట్రాక్ చేయొచ్చు. షుగర్​ కంట్రోల్​లో ఉంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు కూడా తెలుసుకోవచ్చు.

మై ఫిట్​నెస్​ పాల్​

హెల్త్​ రిలేటెడ్​ యాప్స్​లో ఇది కూడా ఒకటి. బయట ఫుడ్​ తినాల్సి వచ్చినప్పుడు.. ఆ ఫుడ్​ ప్యాకెట్​ మీద ఉన్న బార్​ కోడ్​ని ఈ యాప్​లో స్కాన్​ చేస్తే.. ఆ ఫుడ్​లోని న్యూట్రియెంట్​ వాల్యూస్​ తెలిసిపోతాయి. లేదా ఫుడ్​ని ఫొటో తీసి అప్​లోడ్​ చేసినా.. అందులోని న్యూట్రియెంట్​ వ్యాల్యూస్​ని దాదాపుగా చెప్పేస్తుంది. అంతేకాదు.. రోజులో ఎంత తినాలి? ఎంత ఎక్కువ తిన్నాం? అనేది కూడా దీనిద్వారా తెలుసుకోవచ్చు.

ఫిగ్వీ విజువల్ ఫుడ్ డైరీ

చాలామంది తాము ఎంత తింటున్నామో తెలియకుండానే తినేస్తుంటారు. ముఖ్యంగా ఫంక్షన్లకు వెళ్లినప్పుడు, హోటల్​కి వెళ్లినప్పుడు ఇలా జరుగుతుంటుంది. ఏం తింటున్నామో తెలుసు? అందులో ఎన్ని క్యాలరీలు ఉన్నాయో తెలుసు? కానీ.. ఎంత క్వాంటిటీ తింటున్నామనేదే తెలియదు. అలాంటప్పుడు ఈ యాప్​ బాగా యూజ్​ అవుతుంది. ఫిగ్వీ ఫుడ్​ క్వాంటిటీని సరిగ్గా లెక్కగట్టి మరీ చెప్తుంది. యాప్​లో దాదాపు అన్ని రకాల ఫుడ్స్​ ఫొటోలు ఉంటాయి. వాటిలో మీరు తిన్నదానికి సరిపోయే ఫొటోను ఎంచుకుంటే సరిపోతుంది. అందులో సైజులు కూడా ఉంటాయి. సైజు సెలక్ట్​ చేసుకున్న వెంటనే మీరు తిన్న ఫుడ్​కి సంబంధించిన పోషకాహార సమాచారం (కేలరీలు, కొవ్వు, పిండి పదార్థాలు, కొలెస్ట్రాల్) అన్ని డిస్​ప్లే అవుతాయి.

 

మెడికల్​ ఐడీ

మెడికల్​ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో అవసరమయ్యే బెస్ట్​ యాప్​. ఈ యాప్​ని స్క్రీన్​ లాక్​ని అన్​లాక్​ చేయకుండానే యాక్సెస్​ చేయొచ్చు. యాప్​లో పేషెంట్​ ఆరోగ్య పరిస్థితి, మెడికల్​ రికార్డ్స్​ సేవ్​ చేసుకోవచ్చు. అనుకోకుండా ఏదైనా మెడికల్ ​ఎమర్జెన్సీ వస్తే.. రోగి పరిస్థితి తెలుసుకోవడానికి డాక్టర్లకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆండ్రాయిడ్​, ఐఫోన్లలో పనిచేస్తుంది.