ముంబై బై .. 8వ ఓటమితో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు ఆవిరి    

ముంబై బై .. 8వ ఓటమితో ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు ఆవిరి    
  • 24 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా గెలుపు
  • రాణించిన వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • సూర్య, బుమ్రా, నువాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రమ వృథా

ముంబై: ఐపీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–17లో ముంబై ఇండియన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్లే ఆఫ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. 11 మ్యాచ్‌‌‌‌ల్లో ఆ జట్టు ఎనిమిదో పరాజయాన్ని చవి చూసింది. మిగిలిన  మూడు మ్యాచ్‌‌‌‌ల్లో నెగ్గినా ప్లే ఆఫ్స్‌‌‌‌ చేరడం కష్టమే కానుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బౌలర్లు మెరిసినా, బ్యాటర్ల వైఫల్యంతో కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేతిలో 24 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాతో చిత్తయింది. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓడిన కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా తొలుత 19.5 ఓవర్లలో 169 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది.

వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (52 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 3 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 70), మనీశ్ పాండే (31 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 42) రాణించారు. ముంబై బౌలర్లలో బుమ్రా (3/18), నువాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుషార (3/42) చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్‌‌‌‌లో ముంబై 18.5 ఓవర్లలో 145 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (35 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 56), టిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (24) పోరాడినా ఫలితం లేకపోయింది. స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (4/33) దెబ్బకు ముంబై ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదేలైంది. వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ అవార్డు లభించింది. 

మొదట నువాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. చివర్లో బుమ్రా

ముందుగా బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాను ఆరంభంలోనే నువాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తుషార దెబ్బకొడితే చివర్లో బుమ్రా బెంబేలెత్తించాడు. అద్భుతమైన లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో తుషార తన తొలి రెండు ఓవర్లలోనే టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు కీలక వికెట్లు తీశాడు. ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాలుగో బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఫిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాల్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (5), మూడో ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేడాలో రఘువంశీ (13), శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (6)ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాండ్యా (2/44), చావ్లా (1/15) వరుసగా సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (8), రింకూ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (9)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 57 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఇక్కడి నుంచి వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మనీశ్ పాండే భారీ షాట్లకు పోకుండా పరిస్థితులకు తగినట్లుగా రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ క్రీజులో కుదురుకున్నారు. ఈ ఇద్దరి నిలకడతో సగం ఓవర్లకు నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 83/5 స్కోరు చేసింది.  ఆ వెంటనే రెండు ఫోర్లు కొట్టిన వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 12వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తొలి సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కాస్త బ్యాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఝుళిపించాడు. అవతలివైపు పాండే కూడా 4, 6తో జోరు పెంచడంతో తర్వాతి ఐదు ఓవర్లలో 45 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి.

16వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 36 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీ పూర్తి చేయగా, 17వ ఓవర్ ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పాండేను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి మూడో వికెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 83 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యాన్ని విడదీయగా, లాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (7) రనౌటయ్యాడు. అయినా ఈ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మూడు సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో 20 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వచ్చాయి. 18వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుమ్రా మూడు బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తేడాలో రమణ్‌‌‌‌దీప్ (2), స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (0) వికెట్లు తీసి రెండే రన్స్ రన్సే ఇచ్చాడు. 19వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 6, 4 కొట్టిన వెంకటేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చివరి ఓవర్లో బుమ్రా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడంతో కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తక్కువ స్కోరే చేసింది. 

బౌలర్లు అదుర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. 

చిన్న టార్గెట్ ఛేజింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ముంబైని కేకేఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బౌలర్లు కట్టడి చేశారు. రెండో ఓవర్లోనే ఇషాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (13)ను ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇచ్చిన ఆరంభాన్ని నరైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/22), వరుణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/22), రసెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (2/30) కొనసాగించారు. మధ్యలో సూర్య నిలకడగా ఆడినా రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సరైన సహకారం లభించలేదు. వరుస విరామాల్లో నమన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ధీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (11), రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (11), తిలక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వర్మ (4), నేహల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వదేరా (6), హర్దిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాండ్యా (1) ఔటయ్యారు.

దీంతో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్లేలో 46/3 స్కోరు చేసిన ముంబై 12వ ఓవర్లలో 82/6తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో టిమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి సూర్య ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. 14వ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అతను 4, 6, 4, 4తో 20 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దంచాడు. ఇక 36 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 60 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావాల్సిన దశలో సూర్య 16వ ఓవర్లో భారీ షాట్‌‌‌‌కు ట్రై చేసి  వెనుదిరగడంతో ముంబై కోలుకోలేకపోయింది. కొయెట్జీ (8), డేవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరో సిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొట్టినా, 19వ ఓవర్లో స్టార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దెబ్బకు ఈ ఇద్దరితో పాటు చావ్లా (0) కూడా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కావడంతో ముంబై టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అందుకోలేకపోయింది.