ర్యాండమైజేషన్​ ప్రక్రియ పూర్తి : ​హనుమంత్ జెండగే 

ర్యాండమైజేషన్​ ప్రక్రియ పూర్తి : ​హనుమంత్ జెండగే 

యాదాద్రి, వెలుగు : భువనగిరి, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన అదనపు బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తయిందని ఎన్నికల అధికారి, కలెక్టర్​హనుమంత్ జెండగే తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లో నోడల్​అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భువనగిరి పార్లమెంట్​కు సంబంధించి 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున ఒక్కో పోలింగ్​సెంటర్​కు రెండు అదనపు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు.

భువనగిరి అసెంబ్లీ సెగ్మెంట్​కు అదనంగా 642 బ్యాలెట్ యూనిట్లు, ఆలేరు అసెంబ్లీ సెగ్మెంటుకు అదనంగా 772 బ్యాలెట్ యూనిట్లు కేటాయించామని తెలిపారు. ఎన్నికల నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని నోడల్​అధికారులకు సూచించారు. పోలింగ్ సిబ్బందికి కావాల్సిన అన్ని రకాల మెటీరియల్ సిద్ధంగా ఉంచాలన్నారు. సీ–విజిల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్​బెన్ షాలోమ్, అధికారులు​పాల్గొన్నారు. 

మొదటి విడత సప్లమెంటరీ ర్యాండమేషన్​పూర్తి 

నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శుక్రవారం నల్గొండ కలెక్టరేట్​లో బ్యాలెట్ యూనిట్ల మొదటి విడత సప్లిమెంటరీ ర్యాండమేషన్ కార్యక్రమాన్ని అన్ని పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన నిర్వహించారు. నల్గొండ పార్లమెంట్ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున రెండు బ్యాలెట్ యూనిట్లు అవసరం ఉన్న నేపథ్యంలో ఈవీఎంల బ్యాలెట్ యూనిట్లను మొదటి విడత సప్లమెంటరీ రాండమైజేషన్ ను ఈఎంఎస్ సాఫ్​వేర్​ద్వారా నిర్వహించారు. బీయూలను ఆయా నియోజకవర్గాల వారీగా ర్యాండమైజేషన్ చేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఆర్డీవోలు, ఏఆర్వోలు పాల్గొన్నారు.