కాశ్మీర్ లో కొత్త రాజకీయ పార్టీ

కాశ్మీర్ లో కొత్త రాజకీయ పార్టీ
  • మాజీ ఐఏఎస్‌ షా ఫైజల్ అధ్యక్షుడిగా ‘జమ్మూకాశ్మీర్ పీపుల్స్ మూమెంట్’
  • స్టూడెంట్‌‌ లీడర్ షెహ్లా రషీద్ చేరిక

శ్రీనగర్: ఇటీవలే ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన షా ఫైజల్ సొంత రాష్ట్రం జమ్మూకాశ్మీర్‌‌లో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆదివారం శ్రీనగర్ లోని రాజ్ బాగ్ లో జరిగి న కార్యక్రమంలో వందలాది అభిమానులు ముం దు ‘జమ్మూకాశ్మీర్ పీపుల్స్ మూమెంట్(జేకేపీఎం)’ పేరును ప్రకటించారు షా ఫైజల్. కాశ్మీర్ లోయలోని యువతకు ఈ పార్టీ ఓ కొత్త వేదికగా ఉండబోతోందని ఆయన చెప్పారు. ‘స్థానికుల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి జేకేపీఎం కృషి చేస్తుంది. జమ్మూకాశ్మీర్ ను మతం ఆధారంగా విడదీసే శక్తులతో పోరాడతాం. కాశ్మీర్ యువతకు ప్రతినిధులుగా ఉంటాం” అని షా ఫైజల్ అన్నారు. జేఎన్ యూకు చెందిన ప్రముఖ విద్యార్థి నేత షేహ్లా రషీద్ షోరా కూడా జేకేపీఎంలో చేరడం విశేషం. కాశ్మీరీ లపై కొనసాగుతున్న హత్యలు, ముస్లింలపై అణచివేతను నిరసిస్తూ ఫైజల్ గత జనవరిలో తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.