విక్రమ్​ ల్యాండింగ్​పై ఆందోళన అవసరం లేదు: మాధవన్​ నాయర్​

విక్రమ్​ ల్యాండింగ్​పై ఆందోళన అవసరం లేదు: మాధవన్​ నాయర్​
  • భవిష్యత్​ ప్రయోగాలను అది మరింత ముందుకు తీసుకెళుతుంది

విక్రమ్​ ల్యాండింగ్​ ఫెయిలవడంపై పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆ ప్రయత్నం మరిన్ని పెద్ద ప్రాజెక్టులను ముందుకు తీసుకెళుతుందని ఇస్రో మాజీ చైర్మన్​ మాధవన్​ నాయర్​ అన్నారు. విక్రమ్​తో లింక్​ కలిపే అవకాశాలు ఇప్పుడు పూర్తిగా పోయాయని ఆయన చెప్పారు. చంద్రయాన్​2 ప్రయోగం 98 శాతం సక్సెస్​ అయిందన్న ఇస్రో చైర్మన్​ శివన్​ వ్యాఖ్యలను విమర్శిస్తున్న వారిని ఆయన తప్పుబట్టారు. సైన్స్​ అండ్​ టెక్నాలజీలో ఎక్కువ ప్రయోగాలు చేస్తూ సక్సెస్​ అవుతున్న సంస్థ, దేశంలో ఒక్క ఇస్రో మాత్రమేనన్నారు. గత కొన్నేళ్లుగా అది నిరూపితమవుతూనే ఉందన్నారు. ‘‘ప్రయోగాలన్నది ఒక్కరు తీసుకునే నిర్ణయం కాదు. అక్కడ ఓ వ్యవస్థ ఉంటుంది. అందరూ కలిసి చర్చించే ప్రయోగం చేస్తారు. డిజైన్లు, టెస్టింగ్​ అన్ని చూసుకుంటారు. ఒకటికి పదిసార్లు చర్చించాకే ముందుకెళతారు” అని ఆయన అన్నారు. విక్రమ్​ ల్యాండర్​తో కమ్యూనికేషన్​ను పునరుద్ధరించేందుకు సైంటిస్టులు చాలా విధాలుగా ప్రయత్నించారన్నారు. ఎన్నెన్నో పద్ధతులు వాడారన్నారు. ఒక్క సాఫ్ట్​ల్యాండింగ్​ను పక్కనపెడితే చంద్రయాన్​ 2లోని అన్ని మిషన్లు సక్సెస్​ అయ్యాయని ఆయన అన్నారు. సాఫ్ట్​ల్యాండింగ్​ చాలా కష్టమైన పని అన్నారు. ల్యాండర్​లోని సెన్సర్లు మొరాయించి ఉండొచ్చని, లేదంటే సాఫ్ట్​వేర్​లో లోపాల వల్ల కూడా విక్రమ్​ ల్యాండింగ్​ ఫెయిలై ఉండొచ్చని ఆయన అన్నారు. శివన్​ చెప్పినట్టు చంద్రయాన్​ 2 ప్రయోగం 98% సక్సెస్​ అన్నారు.