ఫిలిప్పీన్స్‌లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించడం తనకు గర్వకారణమని ఇండియన్ ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ అన్నారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా ఇండియన్ల తరఫున ఫిలిప్పీన్స్ ప్రజలకు ఇది కానుక అని చెప్పారు. మనీలాలోని మిరియం కాలేజ్ ఆవరణలో ఆదివారం ఆయన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మహాత్ముడు అందరి వాడని, అన్ని సమాజాలకు, సంస్కృతులకు చెందినవారని చెప్పారు. ఐదు రోజుల ఆగ్నేయ ఆసియా దేశాల టూర్ లో భాగంగా ప్రెసిడెంట్ కోవింద్ దంపతులు ఆదివారం ఫిలిప్పీన్స్‌లో పర్యటించారు.

