ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పై చర్చ..డుమ్మాకొట్టిన గంభీర్

ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ పై చర్చ..డుమ్మాకొట్టిన గంభీర్

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్​పొల్యూషన్​పై చర్చించేందుకు నిర్వహించిన పార్లమెంటరీ ప్యానెల్​ హైలెవెల్​ మీటింగ్​కు పలువురు ఎంపీలు, కీలక అధికారులు డుమ్మా కొట్టారు. మొత్తం 29 మంది ఎంపీలకుగాను నలుగురు మాత్రమే హాజరు కావడంపై పార్లమెంటరీ ప్యానెల్​ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అర్బన్​ డెవలప్​మెంట్​పై పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ మీటింగ్​కు సంబంధించిన లిస్ట్​లో ఢిల్లీ నుంచి మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు ఒక్కటే ఉంది. దీనికిఅతడు హాజరుకాలేదు. బీజేపీ ఎంపీ హేమామాలినీ కూడా రాలేదు. ఇండోర్​లో ఇండియా‌‌‌‌‌‌‌‌- బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్ట్​ మ్యాచ్​కు గంభీర్ కామెంటేటర్​గా ఉన్నాడు. దీనిపై ఆప్​ మండిపడింది. ఢిల్లీ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే గంభీర్ ఇండోర్​లో ఎంజాయ్​ చేస్తున్నారంటూ.. తోటి క్రికెటర్లతో కలిసి గంభీర్​ జిలేబీలు తింటున్న ఫొటోను ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది. దీనిపై స్పందించిన గంభీర్​ తన పనే మాట్లాడుతుందంటూ ఆప్​కు కౌంటర్​ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్​లో ఓ లేఖను పోస్ట్​ చేశారు. ఈ అంశంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఎన్విరాన్​మెంట్ మినిస్టర్ ప్రకాశ్ జవదేకర్ చెప్పారు. ‘‘పొల్యూషన్​ విషయాన్ని మేం చాలా సీరియస్ గా తీసుకుంటున్నాం. ఇది ఢిల్లీ సమస్య మాత్రమే కాదు. దీనిపై నేను జాయింట్​ యాక్షన్​ ప్లాన్​కు ఆదేశాలిచ్చాను. టీమ్​లు కోఆర్డీనేషన్​తో పనిచేస్తున్నాయి”అని అన్నారు.