డర్బన్‌ సూపర్ జెయింట్స్ మెంటార్గా గంభీర్

డర్బన్‌ సూపర్ జెయింట్స్  మెంటార్గా గంభీర్

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమి గంభీర్ సూపర్ జెయింట్స్ టీమ్స్ గ్లోబల్ మెంటార్గా నియమించబడ్డాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు మెంటార్గా పనిచేసిన అతను..విదేశీ లీగ్లలో పాల్గొనే సూపర్ జెయింట్స్ టీమ్స్కు గ్లోబల్ మెంటార్గా ఎంపికయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్ సంజీవ్‌ గోయెంకా గ్రూప్‌ కు చెందిన ఫ్రాంచైజీ. ఈ ఫ్రాంచైజీ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో డర్బన్‌ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది.  అతి త్వరలోనే ఈ లీగ్ ప్రారంభం కానుంది. 

గ్లోబల్ మెంటార్తో నా బాధ్యత పెరిగింది..
గ్లోబల్ మెంటార్ గా నాపై నమ్మకం ఉంచినందుకు సూపర్ జెయింట్స్ కు కృతజ్ఞతలు. నా ఐడియాలజీ ప్రకారం క్రికెట్  లీగ్లలో  పదవులకు ఎక్కువ పాత్ర ఉండదు.  టీమ్ గెలిచేందుకు మాత్రమే టీమ్ స్టాఫ్ సహాయపడుతుంది. ప్రస్తుతం సూపర్ జెయింట్స్ గ్లోబల్ మెంటార్ ను నేను బాధ్యత తీసుకుంటా..జట్టు గెలవాలన్న నా ఆశకు ఈ పదవితో మరింత ఉత్సాహం వచ్చినట్లైంది. వరల్డ్ వైడ్గా సూపర్ జెయింట్స్ ఫ్యామిలీ క్రికెట్ లీగ్స్లలో  తనదైన ముద్ర వేయాలని భావిస్తోంది...అని గౌతమ్ గంభీర్ తెలిపాడు.

 

జనవరిలో ఎస్ఈ 20 లీగ్...
వచ్చే ఏడాది జనవరి 10న SA 20 లీగ్ ప్రారంభం కానుంది.  ఈ లీగ్స్లో ఆరు జట్లనూ ఐపీఎల్‌ యజమానులే సొంతం చేసుకోవడం విశేషం. ఇక డర్బన్‌ జట్టులో క్వింటన్‌ డికాక్‌, జేసన్‌ హోల్డర్‌, కైల్‌ మేయర్స్‌, రీస్‌ టాప్లే, డ్వేన్‌ ప్రిటోరియస్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, కీమో పాల్‌, కేశవ్‌ మహారాజ్‌, కైల్‌ అబాట్‌, దిల్షాన్‌ మదుశనక, వియాన్‌ ముల్దర్‌ ఉన్నారు. సూపర్ జెయింట్స్ గ్లోబల్ మెంటార్ గా ఎంపికైన గంభీర్.. డర్బన్‌ ఫ్రాంచైజీ ప్రధాన కోచ్‌ లాన్స్‌ క్లూసెనర్‌తో కలిసి పనిచేయనున్నాడు.