
ముంబై : ఐపీఎల్17లో ఆటగాడిగా, కెప్టెన్‌గా తీవ్రంగా నిరాశ పరిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ సస్పెన్షన్ వేటు పడింది. శుక్రవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. ఈ సీజన్‌లో ముంబై మూడోసారి ఈ తప్పిదం చేయడంతో కెప్టెన్ పాండ్యాకు రిఫరీ రూ. 30 లక్షల జరిమానాతో పాటు ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేశారు. దాంతో వచ్చే సీజన్ తొలి మ్యాచ్‌కు పాండ్యా దూరం కానున్నాడు.