హైదరాబాద్, వెలుగు: ఇండియన్ రేసింగ్ ఫెస్టివల్ (ఐఆర్‌ఎఫ్)లో గోవా ఏసెస్ జె.ఏ రేసింగ్ టాప్ గేర్‌లో దూసుకెళ్తోంది. సోమవారం గోవాలో జరిగిన నాలుగో రౌండ్ స్ట్రీట్ రేసింగ్‌లో ఆతిథ్య ఏసెస్ టీమ్ అద్భుత విజయం సాధించింది. గోవా డ్రైవర్లు రౌల్ హైమాన్, ఫాబియన్ వోల్వెండ్ సమన్వయంతో 42:11.779 సెకన్లలో టార్గెట్‌ను పూర్తి చేసి జట్టును టాప్ ప్లేస్‌లో నిలిపారు. ఫాబియన్ వోల్వెండ్ ఐఆర్‌ఎఫ్‌లో ఓ రేస్ గెలిచిన రెండో మహిళా డ్రైవర్‌గా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 145 పాయింట్లతో ఏసెస్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ రేస్‌కు అటెండైన హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ ఓనర్, టాలీవుడ్ యాక్టర్ నాగచైతన్య ఇండియాలో మోటార్‌స్పోర్ట్ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతోందని ఆశాభావం వ్యక్తం చేశాడు. గోవా నగర నడిబొడ్డున ఇలాంటి కఠినమైన ట్రాక్‌పై రేసును నిర్వహించడం గొప్ప
సాహసమన్నాడు.
