కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా పనులైతలేవు : బీజేపీ కార్పొరేటర్లు

కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా పనులైతలేవు : బీజేపీ కార్పొరేటర్లు

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ముగిసింది. బడ్జెట్ పై ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ వాయిదా వేశారు. బడ్జెట్ ఆమోదం అయిపోయిందని..స్టాండింగ్ కమిటీ ఆమోదం కూడా పొందిందని చెప్పారు. అంతకముందు విపక్ష సభ్యులు పోడియం దగ్గరికి నిరన తెలపడంపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బల్దియాలో ఏ ఒక్క సమస్య పరిష్కారం కావడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా పనులు కావడం లేదన్నారు. 

బెంచీలెక్కిన బీజేపీ కార్పొరేటర్లు

సభ ప్రారంభమైన వెంటనే బీజేపీ కార్పొరేటర్లు ఆందోళనకు దిగారు. సిటీలోని సమస్యలపై నిలదీశారు. మేయర్ డౌన్ డౌన్ అంటూ  నినాదాలు చేశారు. కాంట్రాక్టర్ల కాళ్లు మొక్కినా పనులు కావడం లేదని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. మేయర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. టేబుల్స్ ఎక్కి నిరసన తెలిపారు. దీంతో మేయర్ బెంచీలు దిగాలని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ సభ్యులను బయటకు పంపాలని మార్షల్స్ ను ఆదేశించారు.

ప్లాన్ తోనే విపక్షాల ఆందోళన: మేయర్

చర్చా సమయం వృథా చేయకుండా అందరూ సంయమనం పాటించాలని మేయర్ విజయలక్ష్మీ కోరారు. చర్చలు జరగాలి అనుకుంటే సహకరించాలన్నారు. మేయర్ పోడియం దగ్గరకు రావడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లకు ఎలాంటి సమస్యలు దొరకడం లేదు కాబట్టి ముందస్తు ప్లాన్‭తో వచ్చారని ఆమె ఆరోపించారు. తాము ఎజెండాను అందరూ కార్పొరేటర్లకు ముందుగానే పంపించామని.. అప్పుడు మాట్లాడాల్సి ఉండేదని చెప్పారు. ఇప్పుడు బడ్జెట్ ఆమోదం పొందిందని తెలిపారు. రూ.6,224 కోట్ల బడ్జెట్‭కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపిందని మేయర్ విజయలక్ష్మీచెప్పారు.