కుక్కల నివారణకు  జీహెచ్ఎంసీ  హైలెవల్ కమిటీ

 కుక్కల నివారణకు  జీహెచ్ఎంసీ  హైలెవల్ కమిటీ

హైదరాబాద్ లో  కుక్కల నివారణకు  జీహెచ్ఎంసీ  హైలెవల్ కమిటీని  ఏర్పాటు చేసింది. మేయర్ అధ్యక్షన  అన్ని పార్టీల కొర్పొరేటర్లు, అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. కుక్కల నివారణకు సూచనలు, పలు సలహాలపై   ఈ కమిటీ  నివేదిక ఇవ్వనుంది.జీహెచ్ఎంసీ యానిమల్ కేర్ సెంటర్లను పరిశీలించనుంది.

 ఇటీవల అంబర్ పేటలో కుక్కలు దాడి చేయడంతో   ఆరేళ్ల బాలుడి చనిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా వివాదాస్పదమైంది.  ఈ కేసును సుమోటగా తీసుకున్న హైకోర్ట్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. కుక్కల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో  చెప్పాలని ఆదేశించింది.  ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ ఈ హైలెవల్ కమిటీని నియమించింది.