వ‌రంగల్ ఎంజీఎంలో విషాదం…కరోనా ట్రీట్మెంట్ అంద‌క ఉపాధ్యాయుడు మృతి

వ‌రంగల్ ఎంజీఎంలో విషాదం…కరోనా ట్రీట్మెంట్ అంద‌క ఉపాధ్యాయుడు మృతి

వ‌రంగల్ ఎంజీఎంలో విషాదం చోటు చేసుకుంది. కరోనా లక్షణాలతో చికిత్స పొందుతూ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందారు. మంగపేట మండలానికి చెందిన బాధితుడికి కొద్దిరోజుల క్రితం క‌రోనా ల‌క్షణాలు బ‌య‌ట‌ప‌డ‌డంతో టెస్ట్ చేయించుకున్నారు. ఆ టెస్ట్ రిపోర్ట్ లు ఐదురోజులైన రాక‌పోవ‌డంతో పూర్తిస్థాయిలో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వైద్యులు నిరాక‌రించారు. దీంతో ప‌రిస్థితి విష‌మించి మృతి చెందారు. కాగా వైద్యుల నిర్ల‌క్ష్యం ఆదివాసి సంఘాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. క‌రోనా టెస్ట్ రిపోర్ట్స్ ఆల‌స్యంగా వ‌చ్చినందువ‌ల్లే ఉపాధ్యాయుడు మృతి చెందాడ‌ని, ప్రైవేట్ ఆస్ప‌త్రిలో ట్రీట్మెంట్ తీసుకునే స్థోమ‌త ఉన్నా..టెస్ట్ రిపోర్ట్ లు ఆల‌స్యం వ‌ల్లే మర‌ణించార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అందుకు బాధ్యులైన డాక్ట‌ర్ల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.