ఘనంగా బొమ్మల కొలువు పూజలు

ఘనంగా బొమ్మల కొలువు పూజలు

తమిళనాడులో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు లక్ష్మీదేవిని పూజించారు తమిళ ప్రజలు. పది రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. తమిళనాట నవరాత్రి ఉత్సవాల్లో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వివిధ రూపాల్లో బొమ్మలను తయారు చేసి చెక్క మెట్లపై ఉంచి పూజలు చేస్తారు ప్రజలు.

దేవతల బొమ్మలను కూడా ప్రదర్శిస్తారు. కొయంబత్తూరులోని ఓ ఇంట్లో  అందగా బొమ్మల కొలువు పేర్చారు. దేవతలతో పాటు వివిధ రకాల బొమ్మలను ఉంచి పూజలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి బొమ్మలను కూడా కొలువులో ఉంచారు. కరుణానిధిపై తమకున్న అభిమానంతోనే బొమ్మల కొలువు పేర్చామని ఆ కుటుంబ సభ్యులు చెప్పారు.