పాక్ లో ప్రయాణికులపై కాల్పులు..14 మంది మృతి

పాక్ లో ప్రయాణికులపై కాల్పులు..14 మంది మృతి

పాకిస్థాన్ మరోసారి నెత్తురోడింది. బలుచిస్తాన్ ప్రావిన్స్ లోని మక్రన్‌ కోస్టల్‌ హైవేపై బస్సులో వెళ్తున్న ప్రయాణికులపై  15 నుంచి 20 మంది దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 14 మంది ప్రయాణికులు మరణించారు. జాతీయ రహదారిపై కరాచీ- గ్వాదర్ నగరాల నుంచి వెళ్తున్న ఆరు బస్సులను ఆపి ప్రయాణికులను కిందకు దించి వారిని కాల్చి చంపారు. జాతీయ రహదారిపై బస్సులను ఆపిన దుండగులు ప్రయాణికుల గుర్తింపు కార్డులను తనిఖీ చేస్తూ కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది ఎవరనేది ఇంతవరకు తెలియలేదు. అయితే బలుచిస్తాన్ లో ఏర్పాటు వాదం ఉద్యమం నడుస్తోంది. బలుచిస్తాన్ ప్రజలు తమకు ప్రత్యేక దేశం కావాలని ఉద్యమం చేస్తున్నారు. వారం రోజుల క్రితం క్వెట్టాలో జరిగిన దాడిలో 21 మంది చనిపోయారు.