అలా చేయాలంటే బోర్.. సీత ఎంత మాటనేసింది

అలా చేయాలంటే బోర్.. సీత ఎంత మాటనేసింది

ఒకే ఒక్క హిట్టు మృణాల్​ ఠాకూర్(Mrunal Thakur) ​ను నార్త్​తో పాటు సౌత్​లోనూ బిజీ హీరోయిన్​గా మార్చింది. సీతారామం తర్వాత ఈ బ్యూటీ తెలుగులో నానితో హాయ్​ నాన్న సినిమాలో నటిస్తోంది. విజయ్​ దేవరకొండతో ఓ సినిమాతో పాటు తమిళ్​లో శివకార్తికేయన్​తో ఆఫర్​ కొట్టేసింది. 

అయితే, తనకు అన్ని భాషల్లో నటించాలని ఉందని మృణాల్​ తెలిపింది. ఒకే ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ అక్కడి ఇమేజ్​కు పరిమితమైపోవడం తనకు నచ్చదని చెప్పింది. అందుకు పాత్రల ఎంపికలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటుందట. ఒక నటి నుంచి ప్రేక్షకులు ఇంతకన్నా ఎక్కువ ఏం ఆశించరని ఈ ముద్దుగమ్మ అంటోంది. తన నుంచి కూడా ఒకే లాంటి గ్లామరస్​ పాత్రలు కాకుండా విభిన్నమైన సినిమాలను వారు ఆశిస్తున్నారని..అందుకు తగ్గట్టే తన జర్నీని ప్లాన్​ చేసుకుంటున్నట్టు వివరించింది. 

సీతారామం మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మృణాల్ ఠాకూర్. ఇందులో ఓ వైపు సీతగా, మరోవైపు ప్రిన్సెస్‌‌ నూర్జహాన్‌‌గా తన నటనకు ఫిదా అయ్యారు ప్రేక్షకులు. ప్రస్తుతం మృణాల్ తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం మృణాల్..హీరో నాని తో హాయ్ నాన్న, విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ మూవీస్ లో నటిస్తుంది. 

ALSO READ : ఎవ్వరూ తగ్గలే : జుట్లు పట్టుకుని.. నడి వీధిలో కొట్టుకున్న బీజేపీ మహిళా కార్యకర్తలు