ఎవ్వరూ తగ్గలే : జుట్లు పట్టుకుని.. నడి వీధిలో కొట్టుకున్న బీజేపీ మహిళా కార్యకర్తలు

 ఎవ్వరూ తగ్గలే : జుట్లు పట్టుకుని.. నడి వీధిలో కొట్టుకున్న బీజేపీ మహిళా కార్యకర్తలు

ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ మహిళా కార్యకర్తలు కొట్టుకున్నారు. జుట్టు పట్టి ఈడ్చుకున్నారు. బీజేపీ మహిళా కార్యకర్తల మధ్య చోటు చేసుకున్న ఈ తీవ్ర ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

జుట్టు పట్టీ..

ఉత్తర్ ప్రదేశ్ లోని జలౌన్ లో బీజేపీ నారీ శక్తి వందన్ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా..నడిరోడ్డుపై బీజేపీకి చెందిన మహిళా కార్యకర్తలు కొట్టుకున్నారు. జుట్టు పట్టి ఈడ్చుకున్నారు. ఒక మహిళను వంగపెట్టి..వీపుపై పిడిగుద్దులు గుద్దారు. ఒకరి జుట్టు ఒకరు లాక్కున్నారు. ఈ సమయంలో కొందరు పురుషులు ఓ మహిళను కొట్టారు. 

కాంగ్రెస్, ఎస్పీల విమర్శలు..

బీజేపీ మహిళా కార్యకర్తల గొడవకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విపక్షపార్టీలైన కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ బీజేపీపై మండిపడ్డారు. యూపీలో శాంతి నెలకొల్పుతానంటున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్..ముందు బీజేపీ కార్యకర్తలకు క్రమశిక్షణ నేర్పాలని సమాజ్ వాదీపార్టీ సూచించింది. 

బీజేపీ శక్తివందన్ సమ్మేళనంలో బీజేపీ మహిళా కార్యకర్తలు తమ శక్తిని పరీక్షించుకుంటున్నారని కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఇలాంటి బీజేపీ మహిళలు ఉన్న పార్టీలో మగవాళ్లు ఎలా ఉంటున్నారో...దేవుడే వారిని కాపాడాలంటూ కామెంట్ చేసింది. 

ALSO READ : వీకే సక్సేనా కీలక నిర్ణయం.. కశ్మీర్‌ వలస కుటుంబాలకు రిలీఫ్‌ పెంపు

బీజేపీ మహిళా కార్యకర్తల కొట్టుకున్న వీడియోపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారు.