గండిపేట, వెలుగు: ఉప్పర్‌పల్లి 187 పిల్లర్ వద్ద ఉన్న మారుతి సర్వీసింగ్ సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. పక్కనే ఉన్న స్క్రాప్ గోదాం నుంచి మంటలు వ్యాపించడంతో సర్వీసింగ్‌కు వచ్చిన రెండు కార్లు దగ్ధమయ్యాయి. దట్టమైన పొగలతో సమీప అపార్ట్‌మెంట్ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రెసిడెన్షియల్ ప్రాంతాల్లో స్క్రాప్ గోదాములపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రన్నింగ్ కారులో మంటలు..
మాదాపూర్: రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన మాదాపూర్ సీసీఆర్‌టీ వద్ద జరిగింది. గచ్చిబౌలిలోని కార్యాలయం నుంచి ఇజ్జత్‌నగర్‌కు వెళ్తున్న ఐటీ ఉద్యోగి బి.రాఘవకృష్ణ కారులో ఇంజిన్ నుంచి పొగలు రావడాన్ని గమనించి వెంటనే వాహనాన్ని పక్కకు నిలిపి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. క్షణాల్లో కారు మొత్తం మంటలు వ్యాపించగా ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆర్పివేశారు.
