న్యూఢిల్లీ: ఇండియా షూటర్ ప్రాచీ గైక్వాడ్.. ఆసియా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో డబుల్ గోల్డ్ మెడల్‌తో మెరిసింది. మంగళవారం జరిగిన జూనియర్ విమెన్స్ 3 పీ ఫైనల్లో ప్రాచీ 353.3 పాయింట్లతో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. టొమిరిస్ అమనోవా (కజకిస్తాన్, 351.4), అనుష్క ఠాకూర్ (341.1) వరుసగా రజతం, కాంస్యం నెగ్గారు. టీమ్ విభాగం ఫైనల్లో ప్రాచీ–అనుష్క జోడీ 1748 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచి గోల్డ్‌ను సొంతం చేసుకుంది.
విమెన్స్ 50 మీటర్ల 3 పొజిషన్స్‌లో ఆకృతి దహియా 354.2 పాయింట్లతో సిల్వర్, అంజుమ్ మౌద్గిల్ (340.4) బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నారు. కజకిస్తాన్ షూటర్ సోఫియా షుల్జెంకో 358.2 పాయింట్లతో వరల్డ్ రికార్డును కొల్లగొట్టి గోల్డ్‌ను సాధించింది. మెన్స్ 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ ఈవెంట్‌లో తొలి ప్రిసిషన్ రౌండ్ ముగిసేసరికి ఆదర్ష్ సింగ్ 291/300 టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా 39 స్వర్ణాలు, 15 రజతాలు, 12 కాంస్యాలతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.
