మీ ఓటు ఎక్కడ ఉంది.. తెలుసుకోండిలా!

మీ ఓటు ఎక్కడ ఉంది.. తెలుసుకోండిలా!
  •    వెబ్​సైట్, టీఈపోల్​లో పూర్తి సమాచారం 
  •     వివరాలు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల సంఘం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్​ ఎన్నికల పోలింగ్​ బుధవారం జరుగనుంది. 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో 52.17 లక్షల మంది ఓటు వేయనున్నారు. ఈ నేపథ్యంలో ఓటర్​ స్లిప్​ అందని ఓటర్లు ఆన్​లైన్​లో చాలా ఈజీగా ఓటర్​ స్లిప్​ పొందొచ్చని ఎన్నికల సంఘం మంగళవారం తెలిపింది. ప్రభుత్వ వెబ్​సైట్, టీఈ పోల్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవచ్చని వెల్లడించింది. 

ముందుగా ఓటర్లు గూగుల్​లో తెలంగాణ స్టేట్​ఎలక్షన్​ కమిషన్​ వెబ్​సైట్​(tsec.gov.in) ఎంటర్ చేయగానే బ్లాగ్​ ఓపెన్ అవుతుంది. అందులో "Voter Portal" పై క్లిక్​ చేయగానే ఎడమ వైపు బార్​లో నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో మొదటిది "Download Voter Slip by EPIC ID -Urban, 2025" పై క్లిక్​ చేయాలి. ‘ఆర్డినరీ ఎలక్షన్స్​ టు మున్సిపాలిటీస్​–2025, సెర్చ్  వోటర్​ స్లిప్​ బై ఎంపిక్​ నంబర్’ విండో ఓపెన్​ అవుతుంది. 

దీని కిందనే జిల్లా, మున్సిపాలిటీ, వార్డు, ఎపిక్​ నంబర్​ లాంటి వివరాలు అడుగుతుంది. అవి ఇచ్చాక.. సెర్చ్​ వోటర్​– తెలుగు, సెర్చ్​ వోటర్​–ఇంగ్లిష్​లో ఏదో ఒక దానిపై క్లిక్​ చేస్తే ఓటర్ స్లిప్, మున్సిపాలిటీ, వార్డు నంబరు, పోలింగ్ కేంద్రం, క్రమ సంఖ్య, పేరు, ఎపిక్​ నంబర్ ఇతర వివరాలు కన్పిస్తాయి. మీరు ఆ పేపర్​ను ప్రింట్​ తీసుకోవచ్చు.. లేదంటే ఒక కాగితంపై రాసుకొని  పోలింగ్​ సెంటర్​కు వెళ్లి చూపించినా సరిపోతుందని ఎన్నికల సంఘం తెలిపింది.

టీఈపోల్​ ఫోన్ యాప్​ ద్వారా తెలుసుకోవచ్చు

ఫోన్​లో ప్లే స్టోర్ నుంచి "Te-poll" యాప్​ను డౌన్ లోడ్ చేసుకోవాలి. డ్యాష్ బోర్డులో పైన కనిపించిన ‘Voter slip download’ క్లిక్ చేయాలి. దాంట్లో మొదటి డ్రాప్ డౌన్​లో మీ జిల్లా ఎంపిక చేసుకొని ఎపిక్​ నంబరు ఇచ్చి "Search"  చేయాలి. వోటర్ స్లిప్ కన్పిస్తుంది. దాన్ని సేవ్ చేసుకోవచ్చు. స్లిప్​లో చూపించిన వివరాలు పోలింగ్​ కేంద్రంలో చెప్పి మీ దగ్గరున్న గుర్తింపు కార్డు చూపించి ఓటు వేయవచ్చు.