శ్రీనగర్ లో 31 ఏళ్ల తర్వాత తెరచుకున్న హిందూ ఆలయం

శ్రీనగర్ లో 31 ఏళ్ల తర్వాత తెరచుకున్న హిందూ ఆలయం

కశ్మీర్ లోని శ్రీనగర్ ఉన్న హిందూ ఆలయం 31 ఏళ్ల తర్వాత తెరచుకుంది. 80లలో మిలిటెన్సీ, ఘర్షణల కారణంగా ఆలయం మూతపడింది. అక్కడ హిందువులపై దాడులు జరిగాయి. కశ్మీరీ పండిట్లు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. అప్పట్నుంచి ఆలయం తెరిచినవారు లేరు. అయితే ఇప్పుడు కశ్మీర్ లో పరిస్థితులు మెరుగయ్యాయి. దీంతో బాబా షీతల్ నాథ్ ఆలయంలో పూజలు చేసేందుకు వచ్చారు హిందువులు. వసంత పంచమి సందర్భంగా ఆలయాన్ని తెరిచారు. ఆలయాన్ని క్లీన్ చేశారు. స్థానిక ముస్లింలు కూడా హిందువులకు హెల్ప్ చేశారు. పూజా సామగ్రి తీసుకొచ్చి ఇచ్చారు.