స్టార్ హోటల్లో శివసేన ఎమ్మెల్యేల క్యాంప్

స్టార్ హోటల్లో శివసేన ఎమ్మెల్యేల క్యాంప్

ముంబై:మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై టెన్షన్ కొనసాగుతున్నది. సీఎం సీటును పంచుకోవాల్సిందేనని పట్టుపట్టిన శివసేన పార్టీ గురువారం తన ఎమ్మెల్యేలను స్టార్​ హోటల్​కు తరలించింది. శనివారంతో గత అసెంబ్లీ గడువు ముగియనుండటంతో ఆ లోపే ప్రభుత్వం ఏర్పాటుకాకుంటే రాష్ట్రపతి పాలన విధింపు అనివార్యమయ్యే పరిస్థితి నెలకొంది. అయితే అసెంబ్లీ గడువు ముగిసిన వెంటనే రాష్ట్రపతి పాలన విధించబోరని, కొత్త సర్కార్​ ఏర్పాటుకు కొంత సమయం ఇచ్చే అవకాశాలున్నట్లు రాజ్​భవన్​ వర్గాలు నుంచి లీకులు రావడం చర్చనీయాంశైమంది.

క్యాష్​ బ్యాగ్స్ ఆఫర్​ చేస్తున్నారు!

మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, ఆ మేరకు అవసరమైన న్యాయపరమైన అంశాలను గవర్నర్ భగత్​సింగ్​ కోష్యారీతో చర్చించామని మహారాష్ట్ర బీజేపీ చీప్ పాటిల్​ మీడియాకు చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీని ఆహ్వానించాల్సిందిగా గవర్నర్​ను కోరలేదని స్పష్టం చేశారు. అందుకుముందు ఆయనే తమకు182 మంది ఎమ్మెల్యేల మద్దతుందని చెప్పారు. పాటిల్​ కామెంట్స్​పై శివసేన ఎంపీ సంజయ్​ రౌత్ స్పందిస్తూ, బలం లేకుండానే పవర్​లోకి వద్దామనుకోవడం బీజేపీ అధికార దాహానికి నిదర్శనమని విమర్శించారు. శివసేన ఎమ్మెల్యేలకు  బీజేపీ నేతలు క్యాష్​ బ్యాగ్స్​ ఆఫర్​ చేస్తున్నారని సామ్నా పత్రికలో ఆరోపించారు. ప్రలోభాలకు గురికాకుండా తన 56 మంది ఎమ్మెల్యేలు, సపోర్ట్​ ప్రకటించిన మరో ఆరుగురు ఇండిపెండెంట్లతో శివసేన బాంద్రాలోని రంగ్​శర్దా స్టార్​హోటల్​లో క్యాంప్​ ఏర్పాటుచేసింది. అంతకుముందు వారితో శివసేన చీఫ్​ ఉద్దవ్​ థాక్రే భేటీ మాట్లాడుతూ ‘‘బీజేపీతో కాంప్రమైజ్​ కాదల్చుకుంటే 15 రోజులు టైమ్​ వేస్ట్​ చేసేవాళ్లమేకాదు. ఫిఫ్టీ ఫిఫ్టీపై మనం వెనక్కితగ్గే ప్రసక్తేలేదు’’అని చెప్పారు.