స్విగ్గీ, జొమాటోలపై హోటల్స్ బ్యాన్  

స్విగ్గీ, జొమాటోలపై హోటల్స్ బ్యాన్  

ఈ నెల 11వ  తేది నుంచి అమరావతిలో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్ బ్యాన్ కానున్నాయి. ఫుడ్ ఆర్డర్లపై ఫుడ్ యాప్ లు  తీసుకుంటున్న కమీషనే ఇందుకు కారణం. ప్రస్తుతం ఆర్డర్లపై తీసుకుంటునున కమిషన్ ను 18 నుంచి 25 శాతానికి పెంచడంతో విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకొంది.

మొదట్లో ఎలాంటి కమిషన్ తీసుకోకుండా ఈ యాప్ లు హోటళ్ల నుంచి వినియోగదారులకు ఫుడ్ డెలివరీ చేశాయి. డిమాండ్ కాస్త పెరగడంతో ఆర్డర్లపై కమిషన్ ను ఒక్కో రూపాయి పెంచుకుంటూ 10 శాతానికి, ఆ తర్వాత 18 శాతం వరకూ పెంచుకుంటూ పోయాయి. తాజాగా ఈ 18 శాతం కమిషన్ ను 25 శాతానికి పెంచాలని ఫుడ్ డెలివర్ యాప్ ల సిండి కేట్ నిర్ణయించడంతో విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ భగ్గుమంది. అసలు సరైన బిజినెస్ లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు ఫుడ్ డెలివరీ యాప్ ల కమిషన్ పెను భారంగా మారిందని వాపోయాయి.

ఈ విషయంపై ఫుడ్ డెలివరీ యాప్ ల యాజమాన్యాలతో చర్చించినా కూడా ఎటువంటి ఫలితం లేకపోవడంతో  తొలి విడతగా స్విగ్గీ యాప్ లో తమ మెనూలు తొలగించాలని నిర్ణయించాయి. ఆ తర్వాత కూడా పరిస్ధితిలో మార్పు లేకపోతే మిగతా యాప్ ల నుంచి కూడా విరమించుకుంటామని హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.

Hotels Ban on Swiggy and Zomato, uber eat in Amravati

మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ను ఫాలో అవ్వండి