చక్కెర శాతాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం ఎలాగంటే...

చక్కెర శాతాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం ఎలాగంటే...

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు రక్తంలో చక్కెర శాతాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవడం ముఖ్యం. లేదంటే గుండె జబ్బులు, కంటి చూపు కోల్పోవడం, మూత్రపిండాల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇవి రాకుండా ఉండటానికి మందులతో పాటు ఫిజికల్‌ యాక్టివిటీ చేయాలి. డైట్‌ ఫాలో కావాలి అంటున్నారు న్యూట్రిషనిస్ట్‌ డాక్టర్‌‌ రోహిణి. 

  •  కొన్ని రకాల ఆహార పదార్థాలు చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. ఇంకొన్ని పెంచుతాయి. అందుకే, చక్కెర, కార్బోహైడ్రేట్స్‌, ఫ్యాట్‌ ఎక్కువ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. మంచి డైట్‌ ఫాలో అవుతూ డయాబెటిస్‌ని తగ్గించుకోవచ్చు.
  • ప్రొటీన్‌ ఎక్కువగా ఉండే ఫుడ్‌ ఐటమ్స్‌ రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి. కార్బోహైడ్రేట్స్‌, ఫ్యాట్‌ని బ్యాలెన్స్‌ చేసేందుకు ప్రొటీన్‌ సాయపడుతుంది.
  • విటమిన్‌– బి6 రక్తంలో ఉన్న చక్కెర శాతాన్ని తగ్గించి డయాబెటిస్‌ని పోగొడు తుంది. రోజు ఆహారంలో విటమిన్‌– బి2, బి6 ఉండేలా చూసుకుంటే టైప్‌2 డయాబెటిస్‌ రాకుండా కాపాడుకోవచ్చు.   
  • సరిపడా నీళ్లు తాగడం వల్ల కూడా చక్కెర కంట్రోల్‌లో ఉంటుంది. డీ హైడ్రేషన్‌ అవదు. కిడ్నీలు హెల్దీగా ఉంటాయి. 
  • వర్కవుట్‌ ఎంత చేస్తారో దానికి తగ్గ తిండి తినడం కూడా శరీరానికి అంతే అవసరం. అందుకు పండ్లు, పప్పు దినుసులు, కూరగాయల్ని డైట్‌లో చేర్చుకోవాలి. ఫ్యాట్‌ తక్కువ ఉండే పాల పదార్థాలు తీసుకోవాలి.