హంకాంగ్ లో ఉవ్వెత్తును ఎగసిన ప్రజా ఉద్యమం

హంకాంగ్ లో ఉవ్వెత్తును ఎగసిన ప్రజా ఉద్యమం

గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ గా వెలుగొందే హాంకాంగ్ లో ప్రజాఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. ఇకపై నేరారోపణలు ఎదుర్కొనేవారంతా విచారణకోసం చైనా మెయిన్ ల్యాండ్ లోని కోర్టు లకు వెళ్లాల్సిందేనన్న ప్రతిపాదనను అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తు న్నారు . ప్రపోజల్ ను తక్షణమేరద్దు చేయాలంటూ ఆదివారం 10 లక్షల మందికిపైగా జనం రోడ్డెక్కి ని రసన తెలిపారు. చైనా పాలనలో ఉన్నప్పటికీ ‘స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్రీజన్’ గా హాం కాంగ్ కు ప్రత్యేక హక్కులున్నాయి. దీన్ని పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకునేందుకు బీజింగ్ వర్గా లు చేస్తు న్న ప్రయత్నాల్ని హాంకాంగ్వాసులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు . 1997లో బ్రిటన్ ఏలుబడి నుం చి చైనా చేతుల్లో కి వెళ్లడాన్ని ని రసిస్తూ లక్షల మంది ఆందోళనబాటపట్టారు . మళ్లీ 22 ఏండ్ల తర్వాత జనం మిలియన్ మార్చ్ ని ర్వహించారు.