Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?

Prabhas, Payal: ప్రభాస్ హింట్ ఇచ్చింది.. పాయల్ గురించి కాదు కదా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) చేసిన ఒక్క ఇన్స్టా పోస్ట్ తో సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతోంది. ప్రస్తుతం ఈ టాపిక్ ట్రేండింగ్ లో నడుస్తోంది. కేవలం సోషల్ మీడియాలోనే కాదు న్యూస్ ఛానల్స్ సైతం ప్రభాస్ పోస్ట్ ని బ్రేకింగ్ న్యూస్ గా వస్తున్నారంటే ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆయన.. డార్లింగ్స్ వెయిట్ చేయండి.. మన జీవితాల్లోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు.. అంటూ ఇన్స్టాలో పోస్ట్ చేశారు. అంతే.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో రచ్చ షురూ అయ్యింది. ఆ వ్యక్తి ఖచ్చితంగా ప్రభాస్ లైఫ్ లోకి ఎంటర్ అయ్యే అమ్మాయే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. 

అయితే.. ప్రభాస్ చేసిన స్పెషల్ పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వేళ.. బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ చేసిన పోస్ట్ కూడా తెగ వైరల్ అవుతోంది. కారణం.. తాజాగా ఆమె కూడా తన ట్విట్టర్ లో.. నేను ఖచ్చితంగా ఒకరి డార్లింగ్ ని.. ఆ వ్యక్తి ఎవరో కనుక్కోండి..  అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దాంతో అటు ప్రభాస్, ఇటు పాయల్ పోస్ట్ లు ఇంచుమించు ఒకేరకంగా ఉండటంతో ఇద్దరికీ  కనెక్ట్ అయ్యేలా కామెంట్స్ చేస్తున్నారు. కొందరేమో.. ప్రభాస్ అన్న.. పాయల్ కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే.. ప్రభాస్, పాయల్ పెట్టిన రెండు పోస్టులు ఒకేరకంగా, దాదాపు ఒకే సమయంలో రావడంతో ఆసక్తి నెలకొంది. అంతేకాదు.. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో పాయల్ కూడా తనకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చింది. ఆయన తనకు కొంత సమయాన్ని ఇస్తే తనకోసం ఒకరోజును డేడికేట్ చేస్తానని, తన చేత్తో వంట చేసి స్వయంగా తినిపిస్తానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆ వీడియోని, ఈ పోస్టులని కంపైల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి.. ఈ ఇద్దరు పెట్టిన పోస్టులలో మీనింగ్ ఏంటి అనేది తెలియాలంటే.. ఆ ట్విస్ట్ రివీల్ చేసేవరకు ఆగాల్సిందే.