దంచి కొట్టిన వాన.. చార్మినార్ లో అత్యధిక వర్షపాతం

దంచి కొట్టిన వాన..  చార్మినార్ లో అత్యధిక వర్షపాతం

హైదరాబాద్  వ్యాప్తంగా దాదాపు గంట సేపు వర్షం దంచి కొట్టింది. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి.  రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో  కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అత్యధికంగా ఛార్మినార్ లో 4.7 వర్షపాతం నమోదయ్యింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. హైదరాబాద్ వాసులు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ హెచ్చరించింది.

ఏరియాల వారీగా వర్షపాతం వివరాలు

  • చార్మినార్ లో 4.7  సెంటీమీటర్ల వర్షపాతం 
  • లింగోజిగూడలో 4.4 సెం.మీ.
  • మలక్ పేట, మియాపూర్ లో 4.2 సెం.మీ. 
  • ఖైరతాబాద్, సనత్ నగర్ లో 4.1 సెం.మీ.
  • అంబర్ పేట, లంగర్ హౌస్, సికింద్రాబాద్లో 3.9 సెం.మీ.
  • బంజారాహిల్స్, గోషామహల్ విజయనగర్ కాలనీ, హిమాయత్ నగర్ లో 3.5 సెం.మీ.
  • ఫిలింనగర్, సరూర్నగర్ లో 3.3 సెం.మీ.
  • బోరబండ, యూసుఫ్ గూడా, పటాన్చెరులో 3.1 సెం.మీ 
  • రాజేంద్రనగర్, చిలకలగూడ షేక్పేట్ లో 2.8 సెం.మీ.