
ఇండస్ట్రీకి వచ్చి 21వ సంవత్సరాలు అయినా ఇప్పటికీ అదే గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సిద్ధార్థ్. ‘బొమ్మరిల్లు’ చిత్రంతో తెలుగులో మంచి గుర్తింపును అందుకున్నాడు. ప్రస్తుతం హీరోగానే కాకుండా పలు సినిమాల్లో ఇంపార్టెట్ రోల్స్ చేస్తున్నాడు. తాజాగా తను హీరోగా మరో కొత్త చిత్రం ప్రారంభమైంది. ఈ చిత్రానికి శ్రీ గణేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. అరుణ్ విశ్వశాంతి టాకీస్ బ్యానర్‌పై తెలుగు, తమిళ భాషల్లో దీన్ని రూపొందిస్తున్నారు.
ఇది సిద్ధార్థ్ నటిస్తున్న 40వ సినిమా. ‘సిద్ధార్థ్ 40’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘యూనివర్సల్ ఆడియెన్స్‌కు నచ్చే కంటెంట్ ఇది. యంగ్ టీమ్‌తో కలిసి వర్క్ చేయడం హ్యాపీ. అందరికీ నచ్చేలా సినిమా ఉంటుంది’ అని చెప్పాడు.
‘అన్ని వయసుల ప్రేక్షకులను ఆకర్షించే చిత్రమిది. సిద్ధార్థ్ చాలా కొత్తగా కనిపిస్తారు. జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో ప్రకటిస్తాం’ అని దర్శక నిర్మాతలు చెప్పారు.