మాయదారి మహమ్మారి కరోనా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు అందరూ దాని బారిన పడుతున్నారు. తాజాగా హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మికి కరోనా సోకింది. ఆమె స్వల్ప అస్వస్థతకు గురికావడంతో టెస్ట్ చేయించుకోగా మేయర్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. జీహెచ్ఎంసీ లో సమస్యల పరిష్కారానికి వరుస సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తనను కలిసిన వారు తనతో పాటు పలు కార్యక్రమాల్లో పాల్గొన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి మేయర్ విజయ లక్ష్మి కోరారు. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకున్నానని..ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని..ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. త్వరలోనే కోలుకుని అందరినీ కలుస్తానని చెప్పారు.
రాష్ట్రంలో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. మెజార్టీ ప్రజలు టీకా వేసుకోవడంతో వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. కానీ కరోనా శాశ్వతంగా కంట్రోల్ కాలేదని..ప్రతి ఒక్కరూ కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ఫంక్షన్లు, వివాహాలు,బయటకు వెళ్లేవారు తప్పకుండా ముఖానికి మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు.
I have been tested positive with COVID 19, I'm doing well. Request everyone who came in contact with me to get tested for COVID.
— Vijayalaxmi Gadwal, GHMC MAYOR (@GadwalvijayaTRS) August 24, 2022

