V6 News

కొత్త ట్విస్ట్: ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ గురించి ఓపెన్ అయిన నటి మీరా

కొత్త ట్విస్ట్: ఆలియా భట్ తండ్రి మహేష్ భట్ గురించి ఓపెన్ అయిన నటి మీరా

పాకిస్థాన్ నటి మీరా (Meera): ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆమె 2005లో విడుదలైన ‘నజర్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, తండ్రి మహేష్ భట్ కథ అందించగా, ఆయన సతీమణి సోని రాజ్దాన్ దర్శకత్వం వహించారు. అయితే, ‘నజర్’ సినిమా తర్వాత, మహేష్ భట్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని మీరా ఆరోపించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా వాటిపై స్పందించిన మీరా.. మరోసారి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే..

ప్రస్తుతం మీరా నటిస్తున్న పాకిస్తానీ చిత్రం ‘సైకో’ (Psycho). ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ముఖ్యంగా, తన సినిమా భారత్‌లో విడుదల కాకపోవడంపై నిరాశ వ్యక్తం చేస్తూ, “ఈ సినిమా ఇండియాలో రిలీజ్ కావడం లేదు. దాని గురించి నాకు చాలా బాధగా ఉందని” తెలిపింది.

అలాగే, ఇండియాలో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటూ, డైరెక్టర్ మహేష్ భట్‌తో తన అనుభవాలపై కూడా స్పందించింది. తన నటనను చూసి మహేష్ భట్ చాలా సంతోషపడేవారని, ఆలియా భట్ కూడా ఆనందపడేదని తెలిపింది. “నేను వారి ఇంట్లో ఉన్నప్పుడు అలియా నాతో సమయం గడుపుతూ, నా దగ్గరే పడుకునేది” అని మీరా పేర్కొంది. కానీ, మా బంధంపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, మహేష్ భట్ నుంచి ఎలాంటి వేదింపులు ఎదుర్కోలేదని క్లారిటీ ఇచ్చింది. 

►ALSO READ | Balakrishna: బాలయ్య కోసం కొరటాల స్క్రిప్ట్ రెడీ..

ఆరోపణలపై మీరా క్లారిటీ.. 

‘నజర్’ సినిమా తర్వాత, మహేష్ భట్ తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని మీరా ఆరోపించినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ అంశం అప్పట్లో బాలీవుడ్‌లో పెద్ద సంచలనం సృష్టించింది. అయితే, తాజా ఇంటర్వ్యూలో మీరా ఆ ఆరోపణలను పూర్తిగా ఖండించింది. “నేను ఎప్పుడూ అలాంటి ఆరోపణలు చేయలేదు. ఆయన చాలా మంచి దర్శకుడు” అంటూ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మీరా చెప్పిన మాటలు, బాలీవుడ్ వర్గాల్లో మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి.   

గతంలో వచ్చిన ఆరోపణలు ఏంటి?

2009–2011 మధ్య కాలంలో, మహేష్ భట్ తనను కండీషన్లో పెట్టెకునేవారని, ఇతర దర్శకులతో పని చేయనివ్వలేదని, ఒక సందర్భంలో తనపై దాడి చేశారని మీరా ఆరోపించిందని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా, ఆయన ప్రవర్తనపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. పగలు కూతురిలా చూసే వాడని, రాత్రి వేరేలా ప్రవర్తించేవాడని.. ఇక ఆయన వల్లే బాలీవుడ్ వదిలి దేశం విడిచిపోయాను అంటూ మీరా చెప్పినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి. 

ఈ ఆరోపణలపై స్పందించిన మహేష్ భట్, ఆమె మెంటల్ కండీషన్ బాగాలేదు. ఆమె చాలా అమాయకురాలని, ఆమె ప్రవర్తన విచిత్రంగా ఉంటుందని, కానీ ఆమె మంచి కళాకారిణి అని వ్యాఖ్యానించారని సమాచారం. అదే సమయంలో, ఆమెపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండా వివాదాన్ని ముగించినట్లు సమాచారం.