గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో జోష్లో ఉన్నారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేనితో ముంబై బ్యాక్ డ్రాప్లో ఓ మూవీ (NBK 111) చేస్తున్నారు. ఇదే సమయంలో, NBK 111 ప్రాజెక్ట్‌తో పాటు మరో సినిమా కూడా సమాంతరంగా ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, బాలకృష్ణ కోసం సోషల్ మెసేజ్తో కూడిన మాస్ యాక్షన్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ కథ బాలయ్యకు నచ్చడంతో ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ కాంబినేషన్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘ది ప్యారడైజ్’, ‘మెగా 157’ వంటి సినిమాలను నిర్మిస్తున్న సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నట్లు సమాచారం.
మరోవైపు, కొరటాల శివ ‘దేవర-2’పనిలో ఉన్నారు. అయితే, ఎన్టీఆర్.. డ్రాగన్ మూవీతో పాటుగా ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. ఇక దేవర 2 షూటింగ్లో తారక్ జాయిన్ అవ్వడానికి ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఈ గ్యాప్‌లో బాలయ్యతో సినిమాను పట్టాలెక్కించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కొరటాల భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి
అదే సమయంలో, బాలకృష్ణ లైనప్‌లో మరికొంతమంది యంగ్ డైరెక్టర్లు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందులో సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ, మాస్ కమర్షియల్ చిత్రాలకు పేరుగాంచిన హరీష్ శంకర్, ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల, అలాగే, ‘మార్కో’ డైరెక్టర్ హనీఫ్ అదేని. ఈ నలుగురు డైరెక్టర్స్ బాలయ్యకు కథలు వినిపించారని సమాచారం.
ఈ నేపథ్యంలో, కొరటాల శివతో సినిమా ముందుగా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఇక బాలకృష్ణ 112వ సినిమాపై త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

