V6 News

Allu Arjun: 'రాకా' షూటింగ్ లీక్? అల్లు అర్జున్ వైరల్ ఫోటోల వెనుక అసలు నిజం ఇదీ!

Allu Arjun: 'రాకా' షూటింగ్ లీక్? అల్లు అర్జున్ వైరల్ ఫోటోల వెనుక అసలు నిజం ఇదీ!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ డైరెక్టర్ అట్లీల క్రేజీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇటీవల బన్నీ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘రాకా’ (Raaka) ఫస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేసింది. కేవలం అల్లు అర్జున్ ముఖం, తోడేలును పోలిన చేతిని మాత్రమే చూపిస్తూ విడుదల చేసిన ఆ పోస్టర్, సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో హింట్ ఇచ్చింది.

నెట్టింట ఏఐ చిత్రాలు వైరల్..!

ఫస్ట్ లుక్ ఇచ్చిన కిక్కుతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ ఫుల్ కాస్ట్యూమ్, గోర్లు, చర్మంతో ఉన్న దుస్తులు ధరించి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి చూసిన ఫ్యాన్స్ కొందరు ఇవి షూటింగ్ లొకేషన్ నుంచి లీక్ అయిన ఫోటోలు అని భావించారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. అవి ఏఐతో సృష్టించిన చిత్రాలు. ఒక వీడియో ఎడిటర్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఇవి కేవలం ఏఐ క్రియేషన్స్ మాత్రమేనని డిస్ల్కైమర్ ఇచ్చారు. అయినాసరే.. బన్నీ మేకోవర్ ఊహలకే అందనంత అద్భుతంగా ఉన్నాయంటూ అభిమానులు వీటిని ట్రెండ్ చేస్తున్నారు.

 

పోలికలతో మారుతున్న అంచనాలు

‘రాకా’ ఫస్ట్ లుక్ చూసిన నెటిజన్లు ఇతర సినిమాలతో పోలికలు వెతుకుతున్నారు. బన్నీ టాటూలు, గుండు, గడ్డం లుక్ చూస్తుంటే ‘కాశీమోర’లో కార్తీని గుర్తుకు తెస్తోందని కొందరు. ఆ చర్మంతో కూడిన దుస్తులు ‘కంగువ’లో సూర్య లుక్‌ను పోలి ఉన్నాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా ‘బాహుబలి’ లోని క్రూరమైన విలన్ల గెటప్‌లతో దీనిని పోలుస్తున్నారు. ఏదేమైనా, అట్లీ తన మార్క్ మాస్ ఎలిమెంట్స్‌తో అల్లు అర్జున్‌ను వెండితెరపై మునుపెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నాడరంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

అట్లీ ఎమోషనల్ నోట్.. 

ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు అట్లీ ఎక్స్‌ (X) వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'రాకా' అనేది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది నా 18 ఏళ్ల కల. ఈ ఐడియాను ఇన్నేళ్లుగా నాలోనే దాచుకున్నాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ సినిమాపై అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లారు. మరోవైపు, ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ఒక కీలక అతిథి పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. షారుఖ్ స్వయంగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటం ఈ ఊహాగానాలకు మరింత బలాన్నిస్తోంది. దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం, అల్లు అర్జున్-అట్లీ కాంబోలో బాక్సాఫీస్ వద్ద ఎన్ని రికార్డులను తిరగరాస్తుందో చూడాలి.