కరోనాతో పోలీసుల పరేషాన్..

కరోనాతో పోలీసుల పరేషాన్..

హైదరాబాద్‌‌, వెలుగు: కరోనా పోలీస్ డిపార్ట్ మెంట్ ను టెన్షన్ పెట్టిస్తుండగా, సిబ్బంది లీవ్స్ కోసం క్యూ కడుతున్నారు. దాంతో స్టేషన్లలో స్టాఫ్ కొరత ఏర్పడుతోంది. పోలీసుల్లో పాజిటివ్‌ ‌కేసులు పెరుగుతుండడంతో కాంటాక్స్ ఉన్నవాళ్లు, కరోనా సింప్టమ్స్ లాంటి సీజనల్‌ వ్యాధులతో బాధపడుతున్న వాళ్లు హెల్త్‌‌రిపోర్తో ట్ లీవ్‌‌కి అప్లయ్ చేసుకుంటున్నారు. గ్రేటర్‌ ‌‌‌మూడు కమిషనరేట్ల పరిధిలోని లా అండ్‌ ఆర్డర్ , ట్రాఫిక్, ఎస్బీ, సెంట్రల్‌ క్రైం స్టేషన్‌‌లో సెలవులపై వెళ్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. మరోవైపు 50 ఏండ్లపైబడిన వాళ్లు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ సిక్‌‌ అవుతున్నారు. ఇలాంటి వాళ్లుకరోనా పరిస్థితుల్లో డ్యూటీ రిస్క్ అనుకుని లీవ్స్ పై వెళ్తున్నారు.

పంద్రాగస్టు, గణేశ్ ఉత్సవాలకు ఎలా?

సిటీ కమిషనరేట్పరిధిలో పోలీస్‌‌స్టే షన్లలో ఒక్కోచోట 70 నుంచి 90 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కరోనా పాజిటివ్‌‌వచ్చిన స్టేషన్లలో 25 మంది దాకా లీవ్ పై వెళ్తున్నట్లు తెలిసింది. కరోనా కాంటాక్స్‌‌ , సింప్టమ్స్పోలిన సీజనల్‌ డిసీజెస్ రిపోర్స్‌‌ ట్ సబ్మిట్ చేస్తుండడంతో హౌస్ ఆఫీసర్లు పర్మిషన్ ఇస్తున్నారు. ఇటీవల బోనాలు, బక్రీద్ పండుగలకు పరిమితం గా ఉన్న సిబ్బందితోనే బందోబస్తు నిర్వహించారు. త్వరలో పంద్రాగస్టు, వినాయక చవితి నవరాత్రులు వస్తున్నాయి. వాటి బందోబస్తుకు సిబ్బంది కొరత డిపార్మెంట్ ట్ ను ఇబ్బంది పెడుతోంది.

ఐపీఎస్ నుంచి హోంగార్డు దాకా..

లాక్‌‌డౌన్‌‌రిలాక్సేషన్స్ తర్వాత ఐపీఎస్‌‌ఆఫీ సరతోపాటు గ్రౌండ్‌ లెవల్‌లో పని చేస్తున్నఇన్‌‌స్పెక్టర్లు, ఎస్‌‌ఐ, కానిస్టేబుల్‌, హోంగార్డ్స్‌‌ సహా అడ్మినిస్ట్రేట్‌‌ సిబ్బందిని కరోనా వదల్లేదు. హైదరాబాద్‌‌, సైబరాబాద్‌‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 850 దాకా కేసులు రిపోర్ట్‌‌అయ్యాయి. ఐదుగురు ఏఎస్‌‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు, ముగ్గురు హోంగార్డ్స్‌‌ మృతిచెందారు. సుమారు 65 శాతం మంది కోలుకుని డ్యూటీలో జాయిన్‌ ‌అయ్యారు.మరో 35 శాతం మంది సిబ్బంది హోం ఐసోలేషన్‌‌తోపాటు హాస్పిటల్స్లో ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుంటున్నారు.