పోక్సో కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు

పోక్సో కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు

మైనర్ పై అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తికి రంగారెడ్డి జిల్లా కోర్టు 20 ఏండ్ల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పునిచ్చింది. బాధితురాలి కుటుంబానికి రూ.5 లక్షలు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఒడిశాకు చెందిన మహ్మద్ రషీద్(28), చార్మినార్​లోని తలాబ్ కట్టకు చెందిన అక్బర్ ఖాన్(30)తో కలిసి లేబర్ పనిచేసేవాడు. వీరిద్దరు బాలాపూర్ పరిధిలో ఉండే ఓ బాలికను 2015 అక్టోబర్ 18 అత్యాచారం చేశారు. బాలాపూర్ పోలీసులు రేప్, పోక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ వీవీ చలపతి ఆధ్వర్యంలో  సాక్ష్యాధారాలు సేకరించారు. విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఎమ్‌‌‌‌ఎస్‌‌‌‌జే కోర్టు రషీద్, అక్బర్​ను దోషులుగా తేల్చింది. అనారోగ్యం కారణంగా అక్బర్ చనిపోవడంతో రషీద్​కు పై శిక్షను ఖరారు చేస్తూ తీర్పునిచ్చింది.


హైదరాబాద్,వెలుగు: గుడ్‌‌‌‌ టచ్‌‌‌‌ బ్యాడ్‌‌‌‌ టచ్‌‌‌‌, ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేని వయసు. తెలిసిన వాళ్లే తమ పాలిట శాపంగా మారుతున్నా గుర్తించలేని అమాయకత్వం. చాక్లెట్స్‌‌‌‌ ఇప్పిస్తానని ఒకడు, ఫ్రెండ్‌‌‌‌ షిప్‌‌‌‌ పేరుతో మరొకడు ఇలా మైనర్లపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.  జూబ్లీహిల్స్‌‌‌‌లో మైనర్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ రేప్‌‌‌‌ ఘటన, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల బాలికలపై జరిగిన లైంగిక దాడుల నేపథ్యంలో పోలీసులు పోక్సో కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రతి ఏటా నమోదవుతోన్న పోక్సో కేసులు చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాల తీవ్రతను తెలియజేస్తున్నాయి. 

ప్రాసిక్యూషన్‌‌‌‌లో ఫెయిల్‌‌‌‌ కావొద్దు

జూబ్లీహిల్స్ మైనర్‌‌‌‌‌‌‌‌ గ్యాంగ్‌‌‌‌ రేప్‌‌‌‌ ఘటనలో ఆరుగురు నిందితులకు కఠిన శిక్షలు పడేలా పోలీసులు సాక్ష్యాధారాలు కలెక్ట్‌‌‌‌ చేస్తున్నారు.  దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన పోక్సో కేసుల్లోనూ నిందితులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల ఫింగర్ ప్రింట్స్‌‌‌‌ దగ్గరి నుంచి డీఎన్ఏ శాంపిల్స్ వరకు ప్రాసిక్యూషన్‌‌‌‌ ఎవిడెన్స్​ను కలెక్ట్ చేస్తున్నారు.  ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ రిపోర్టు, బాధితుల సాక్ష్యం ఆధారంగా నిందితులను కోర్టులో దోషులుగా నిరూపిస్తున్నారు. మైనర్లు, యువతులు, మహిళలపై జరుగుతున్న నేరాలపై జనాలకు అవగాహన కల్పిస్తున్నారు. తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతాన్ని పెంచేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం డీజీపీ ఆఫీసులో స్పెషల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్ సెంటర్‌‌‌‌ ఏర్పాటు చేయనున్నారు. కేసుల్లో శిక్షల శాతం పెంచేందుకు అవసరమైన సూచనలు,సలహాల కోసం మెజిస్ట్రేట్లు, జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌‌‌‌‌‌‌‌తో ఇంట్రాక్ట్‌‌‌‌ అయ్యేలా చూడనున్నారు. నేరస్తులకు కఠిన శిక్ష పడితేనే లైంగిక దాడులకు అడ్డుకట్ట పడుతుందని పోలీసులు భావిస్తున్నారు. క్రైమ్ ప్రివెన్షన్‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌తో వర్క్‌‌‌‌ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కేసులకు  సంబంధించిన ఓరల్ ఎంక్వయిరీలను ఎప్పటికప్పుడు పూర్తి చేయనున్నారు.