ఘనంగా ఎయిర్‌ ఫోర్స్ డే సంబురాలు

ఘనంగా ఎయిర్‌ ఫోర్స్ డే సంబురాలు

ఘజియాబాద్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) 89వ వార్షికోత్సవ  వేడుకలు ఘనంగా  జరుగుతున్నాయి. ఘజియాబాద్‌‌లోని హిండాన్  ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌‌లో జరుగుతున్న ఈ వేడుకలకు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌‌తో పాటు ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరి, ఆర్మీ చీఫ్  నరవాణే, నేవీ చీఫ్ కరమ్ బీర్ సింగ్  హాజరయ్యారు. సైనికుల కవాతు, పారామిలిటరీ ట్రూప్‌లు, విమానాలు, హెలికాప్టర్ల  విన్యాసాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. కాగా, ఐఏఎఫ్‌ను 1932, అక్టోబర్ 8న అప్పటి బ్రిటిష్ సైన్యానికి చెందిన యునైటెడ్ కింగ్‌డమ్స్ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు సహాయక బలగాలుగా ఉంటుందని స్థాపించారు. అప్పుడు దీన్ని రాయల్ ఇండియన్  ఎయిర్ ఫోర్స్‌గా పిలిచేవారు. అయితే భారత్‌కు స్వాతంత్ర్యం లభించాక 1950లో ఈ పేరులో నుంచి రాయల్‌ను తొలగించారు. అప్పటి నుంచి భారత సాయుధ దళాల్లో ఐఏఎఫ్ ఎయిర్ వింగ్‌గా చేరింది. ప్రపంచంలోని నాలుగో అతిపెద్ద ఎయిర్‌ ఫోర్స్‌గా ఐఏఎఫ్‌ను చెప్పొచ్చు. ఈ వాయు దళానికి ఎయిర్ చీఫ్ మార్షల్ హెడ్‌గా.. మొత్తం దేశ సాయుధ దళాలకు భారత రాష్ట్రపతి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరిస్తారు. 

మరిన్ని వార్తలు: 

ఆడుకుంటుంటే నన్ను కొట్టాడు... పోలీస్‌ స్టేషన్‌లో బాలుడి ఫిర్యాదు

ధనిక రాష్ట్రంలో 71% పేదలే

పెట్రోల్​ బంకుల్లో ‘చిప్’ ​మోసాలు

సర్కారు జాబ్ ఒక్కటే ఉద్యోగమా?: మంత్రి తలసాని