కులభూషణ్ జాదవ్ కేసులో నేడు తుది తీర్పు

కులభూషణ్ జాదవ్ కేసులో నేడు తుది తీర్పు

పాకిస్థాన్ ఆర్మీ జైళ్లో ఉన్న భారత నౌకాదళ మాజీ అధికార కులభూషణ్ జాదవ్ ఇష్యూలో.. ఇవాళ అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. ఇవాళ సాయంత్రం ఆరున్నరకు ఇంటర్నేషనల్ కోర్టు తీర్పు చెప్పనుంది. భారత్ కు అనుకూలంగానే తీర్పు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్నేషనల్ కోర్టు  ఏ తీర్పు ఇచ్చినా స్పీకరిస్తామని.. పాకిస్థాన్ కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే రెండు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించాయి.

గూఢచర్యం ఆరోపణలపై 2016 మార్చి 3న కులభూషణ్ జాదవ్ ను అరెస్ట్ చేసింది పాక్ ఆర్మీ. అక్రమంగా పాక్ లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారని గూఢచర్యం చేశారని, పాక్ లో ఉగ్రవావాద కార్యకలాపాలను ప్రోత్సహించారని.. ఆయనకు పాక్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించింది. దీనిపై భారత్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భారత్ తరుపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. దీంతో తీర్పు ఇచ్చే వరకు శిక్ష అమలు ఆపేయాలని పాకిస్థాన్ ను ఆదేశించింది.