
మంచు ఫ్యామిలీ ప్రతిష్ట్మాకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప(Kannappa). మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మంచు మోహన్ బాబు(Mohan Babu) కూడా కీ రోల్ చేస్తున్నారు. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముకేశ్ కుమార్ సింగ్(Mukhesh kumar singh) తెరకెక్కిస్తున్నారు.
మంచు ఫ్యామిలీలోనే బిగ్గెస్ట్ సినిమాగా వస్తున్న కన్నప్ప ను ఎలాగైనా హిట్ చేయాలని ఫిక్స్ అయినట్టున్నారు మేకర్స్.అందుకే ఈ సినిమా కోసం ఇండియన్ వైడ్ గా స్టార్ క్యాస్ట్ ను దింపుతున్నారు.అయితే రీసెంట్గా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar) నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం..అక్షయ్ కుమార్ తన పాత్రకి సంబంధించిన వరకు చిత్రీకరణ పూర్తి చేశారు.కాగా ఈ అంశంపై హీరో విష్ణు మంచు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"స్టార్ అక్షయ్ కుమార్ తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉందని.ఆయన నుంచి చాలా నేర్చుకున్నానని విష్ణు తెలిపాడు. ఆయనతో చేసిన ప్రయాణం ఎంతో విలువైనది. ఫ్యూచర్ లో మళ్లీ మళ్లీ ఇలాగే కలవాలని ఉందని..తన ట్వీట్ ద్వారా అభిప్రాయం వ్యక్తం చేశాడు.
What a shoot it has been with @akshaykumar. Learnt. Laughed. And now missing the action. Looking forward for many more.#????????? pic.twitter.com/lUzBfydcHx
— Vishnu Manchu (@iVishnuManchu) May 3, 2024
అయితే, ఈ సినిమాలో శివుడి పాత్రలో ప్రభాస్ కాకుండా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. కన్నప్పతో తెలుగు చిత్రసీమలోకి అరంగేట్రం చేసినందుకు అక్షయ్ ఎప్పుడు రెడీ గా ఉండునట్లు ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.
ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే..ఇప్పటికే దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరి ఇంతమంది స్టార్స్ తో వస్తున్న ఈ ప్రెస్టీజియస్ మూవీ ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
The #????????? journey just got more thrilling as we welcome the Superstar Mr. Akshay Kumar to the Telugu Film Industry. Thrilled to announce his debut in Telugu cinema with Kannappa. Get ready for an unforgettable adventure! ?❤️@akshaykumar #akshaykumar… pic.twitter.com/o7lnOJP3BH
— Vishnu Manchu (@iVishnuManchu) April 16, 2024