
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేసీఆర్ పై విమర్శలు చేశారు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. తెలంగాణ వచ్చాక కేవలం కేసిఆర్ ఫ్యామిలీ ఆస్తులు పెరిగాయని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని ఫైర్ అయ్యారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు చెంప దెబ్బ కొట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు గ్యాస్ ధర రూ. 460 ఉంటే మోదీ వచ్చాక రూ. 12వందలు చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్ రెడ్డి రూ. 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ లీడర్ల పై ఒత్తిడి తేవడానికే ఈడి పని చేస్తుందని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ పార్టీ జనగర్జన సభలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. ఎలక్షన్ కోడ్ రావడం వల్ల కొన్ని స్కీంలు ఆగిపోయాయని తెలిపారు.
రుణమాఫీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుందనే పీఎం మోదీ ఆపించారని చెప్పారు వివేక్ వెంకటస్వామి. ఎలక్షన్ అయిపోగానే ఖచ్చితంగా బ్యాంకర్లతో మాట్లాడి రుణమాఫీ చేస్తామని తెలిపారు. బీజేపీ రాముడి పేరు చెప్పి ఓట్లు అడుగుతుందని విమర్శించారు. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. ప్రజా సేవ చేయడానికే వంశీ వస్తున్నారని కాకాకు అండగా ఉన్నట్టే వంశీకి ఉండి గెలిపించాలని వివేక్ వెంకటస్వామి కోరారు.