ఇటీవల విడుదలైన ‘ఓజీ’ చిత్రంలో పవన్ కళ్యాణ్‌కు జోడీగా నటించి అలరించిన ప్రియాంక మోహన్.. తాజాగా తన కొత్త సినిమా అప్‌డేట్‌తో ముందుకొచ్చింది. కన్నడ స్టార్ ధనంజయ లీడ్ రోల్‌లో నటిస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ చిత్రంలో ఆమె నటిస్తున్నట్టు టీమ్ రివీల్ చేసింది. అలాగే ప్రియాంక ఫస్ట్ లుక్ పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు. రెండు వేర్వేరు పోస్టర్లలో విడుదలైన ఈ ఫస్ట్ లుక్‌లో ఆమె వింటేజ్ లుక్‌లో ఇంప్రెస్ చేస్తోంది. తన డ్రెస్సింగ్ స్టైల్ మేకోవర్‌తో ఆకట్టుకుంటుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను వైశాక్ జె ఫిలిమ్స్ బ్యానర్‌పై హేమంత్ ఎం. రావు దర్శకత్వంలో వైశాక్ జె. గౌడ నిర్మిస్తున్నారు. చరణ్ రాజ్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. తెలుగు, కన్నడ భాషల్లో సినిమా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
