పిల్లలు అవి సెర్చ్ చేస్తే.. పేరెంట్స్కు అలెర్ట్!

పిల్లలు అవి సెర్చ్ చేస్తే.. పేరెంట్స్కు అలెర్ట్!

టీనేజర్స్ కోసం ఇన్​స్టాగ్రామ్ ఒక మంచి ఫీచర్​ను యాడ్ చేసింది. ఒక టీనేజర్ సూసైడ్ లేదా సెల్ఫ్​ హార్మ్​కి సంబంధించిన పదాలు సెర్చ్ చేస్తే వెంటనే ఇన్​స్టా తల్లిదండ్రులను అలెర్ట్ చేస్తుంది. ఈ అలెర్ట్​ ఫీచర్​ ఇంటర్నెట్​ మీడియా ప్లాట్​ఫామ్​ పేరెంటల్​ సూపర్​ విజన్​ ప్రోగ్రామ్​లో చేరిన తల్లిదండ్రులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 

అంతేకాదు సెర్చ్​ రిజల్ట్​లో అటువంటి కంటెంట్ కనిపించకుండా ఇప్పటికే బ్లాక్ చేసిందని, ప్రజలను హెల్ప్​ లైన్​కు మళ్లించిందని మెటా తెలిపింది. పేరెంట్స్​కు ఈమెయిల్​, టెక్స్ట్​ లేదా వాట్సాప్ ద్వారా అలెర్ట్ ఇస్తుంది. ఇన్​స్టాగ్రామ్​ అకౌంట్​ నుంచి కూడా నోటిఫికేషన్లను పంపిస్తుంది. పిల్లలకు హాని కలిగించే కంటెంట్ నుంచి దూరంగా ఉంచాలని ఈ నిర్ణయం తీసుకుంది.