శంషాబాద్ఎయిర్ పోర్టు నుంచి.. గల్ఫ్ దేశాలకు 45 విమానాలు రద్దు

శంషాబాద్ఎయిర్ పోర్టు నుంచి.. గల్ఫ్ దేశాలకు 45 విమానాలు రద్దు

అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్దం కారణంగా  శంషాబాద్ ఎయిర్ పోర్టు  గల్ప్ దేశాలకు పలు విమానాలను రద్దు చేశారు.  దోహా, జెడ్డా, ఖతార్, అబుదాబి, సౌదీ అరేబియా, కువైట్,మస్కట్, మదీనా  దేశాలకు ఫ్లైట్ సర్వీసులు రద్దు చేశారు.  మొత్తం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి 45 విమానాలను రద్దు చేశారు. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. 

మరో వైపు దేశవ్యాప్తంగా  ఉన్న  ఎయిర్ పోర్టుల నుంచి కూడా పలు విమానాలను రద్దు చేసినట్లు డీజీసీఏ ప్రకటించింది. 14 గంటలుగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. ముంబై ఎయిర్ పోర్టులో కూడా ఇదే పరిస్థితి. 

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై దాడులు చేస్తున్న క్రమంలో వాటి మిత్రదేశాలైన  ఖతార్, అబుదాబి, సౌదీ అరేబియా, కువైట్ లపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. అక్రమంలో ఆయా దేశాలు తమ ఎయిర్ స్పేస్ లను మూసివేశాయి. గల్ప్ లో వ్యాపార, వాణిజ్య కార్యాలయాలు పూర్తిగా క్లోజ్ చేశారు.