Catherine Tresa: హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో హీరోయిన్ కేథరీన్ సందడి.. కలర్స్ హెల్త్ కేర్ 2.0 గ్రాండ్ ఓపెనింగ్

Catherine Tresa: హిమ‌య‌త్‌న‌గ‌ర్‌లో హీరోయిన్ కేథరీన్ సందడి.. కలర్స్ హెల్త్ కేర్ 2.0 గ్రాండ్ ఓపెనింగ్

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హిమయత్‌నగర్ వీధులు శనివారం (ఫిబ్రవరి 28న) ఉదయం నుంచే కోలాహలంగా మారాయి. ఏదో భారీ సినిమా షూటింగ్ జరుగుతోందా అన్నట్లుగా జనం ఎగబడ్డారు. కటౌట్లు, పూల అలంకరణలు, కెమెరా వెలుగుల మధ్య వాతావరణం పండుగలా మారింది. దానికి కారణం.. వెండితెర 'ఇద్దరమ్మాయిలతో' సుందరి, గ్లామర్ క్వీన్ కేథరీన్ థెరీసా అక్కడ అడుగుపెట్టడమే.

హైదరాబాద్‌ హిమయత్‌నగర్‌లో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ నూతన బ్రాంచ్‌ను హీరోయిన్ కేథరీన్ థెరీసా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్న కేథరీన్.. అక్కడి అత్యాధునిక టెక్నాలజీని ప్రశంసించారు. 

గ్లామర్ మెరుపులతో మొదలైన వేడుక

సినిమా క్లైమాక్స్ సీన్ తరహాలో బ్లాక్ కలర్ లగ్జరీ కార్ నుంచి కేథరీన్ దిగగానే అభిమానుల కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. షాపింగ్ మాల్ ఓపెనింగ్ లాంటి రొటీన్ కార్యక్రమంలా కాకుండా, ఒక నక్షత్రం నేలకు దిగివచ్చినట్లుగా ఆమె తన చిరునవ్వుతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది.

హిమయత్‌నగర్ తిరుమల ఎస్టేట్‌లో కొలువుదీరిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ నూతన బ్రాంచ్‌ను ఆమె రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. లోపలికి అడుగుపెట్టిన కేథరీన్, అక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేవలం ఒక హెల్త్ సెంటర్ లా కాకుండా, అది ఒక ఇంటర్నేషనల్ వెల్‌నెస్ స్టూడియోను తలపించింది.

హీరోయిన్ మాటల్లో ఫిట్‌నెస్ రహస్యం

ఈ సందర్భంగా కేథరీన్ మాట్లాడుతూ.. సినిమా స్క్రీన్ మీద మేము అందంగా కనిపిస్తున్నామంటే దాని వెనుక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ఉంటుంది. నేటి కాలంలో సామాన్యులైనా, సెలబ్రిటీలైనా ఫిట్‌నెస్ అనేది విలాసం కాదు, అది ఒక అవసరం. ‘కలర్స్ హెల్త్ కేర్ 2.0’ వారు తీసుకొచ్చిన ఈ ఆధునిక టెక్నాలజీ చూస్తుంటే ముచ్చటేస్తోంది. నాణ్యమైన సేవలను ప్రజల చెంతకు చేర్చడం అభినందనీయం,” అంటూ తనదైన శైలిలో సినిమాటిక్ టచ్ ఇచ్చారు.

22 ఏళ్ల ప్రస్థానం.. కలర్స్ హెల్త్ కేర్ కథ

ఈ వేడుక వెనుక ఒక బలమైన విజయగాథ ఉంది. 2004లో ఒక చిన్న ఆశతో మొదలైన ఈ సంస్థ, నేడు 22 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని 52 బ్రాంచీలతో దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ, తమ సంస్థ సాధించిన మైలురాళ్లను గుర్తుచేసుకున్నారు.

యూఎస్-ఎఫ్‌డీఏ ఆమోదం పొందిన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన టెక్నాలజీని ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. అధిక బరువు, జుట్టు రాలడం, చర్మ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక ‘వన్ స్టాప్ డెస్టినేషన్’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.